Tollywood Heroine: ఆ తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. హిందీలో వరుసగా సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో కూడా ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ అని చెప్పొచ్చు. ఒక సినిమాతో కోట్లాది మంది ఫాలోవర్స్ ను దక్కించుకుంది. ప్రస్తుతం కుర్రాళ్ళ గుండెల్లో ఈమె ఆరాధ్య దేవత. ఇటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే నటనపై ఉన్న ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కెరియర్ ప్రారంభంలో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది. ప్రస్తుతం ఈమె టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతుంది. ఒక సినిమాలో చేసిన చిన్న పాత్రతో బాగా ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలో బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం కూడా సాధించింది. ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్ కంటే కూడా ఈమె ఎక్కువ పాపులారిటీ ని దక్కించుకుంది. చిన్నప్పటి ఫోటోలో ఎంతో క్యూట్ గా ఉన్నా ఈ హీరోయిన్ మరెవరో కాదు తృప్తి డిమ్రీ.
Also Read: ఒకప్పుడు మిస్ ఇండియా.. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ ను ఏలేస్తున్న హీరోయిన్…
పాన్ ఇండియా మూవీ ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తృప్తి దిమ్రి ఫిబ్రవరి 23, 1995లో జన్మించింది. శ్రేయస్ తల్పడే దర్శకత్వం వహించిన పోస్టర్ బాయ్స్ అని సినిమాతో హిందీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటులు సన్నీడియోల్, బాబీ డియోల్, తల్పాడే ప్రధాన పాత్రలలో నటించారు. కానీ ఈ సినిమాతో తృప్తికి అంతగా గుర్తింపు అయితే రాలేదు అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆమె నటించినా లైలా మజ్ను, బుల్బుల్,ఖలా అనే సినిమాలతో 2018లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. గత ఏడాది రిలీజ్ అయిన యానిమల్ సినిమాతో తృప్తి కెరియర్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పొచ్చు.
ఇందులో ఈమె నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. రణబీర్ కపూర్, రష్మిక మందన హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డివంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా విజయం తర్వాత తృప్తికి హిందీలో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇటీవలే ఈ అమ్మడు బాడ్ న్యూస్ అనే సినిమాతో కూడా మరో విజయం అందుకుంది. అలాగే విక్కీ విద్యా కా వాహ వాలా అనే చిత్రంలో కూడా నటించింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది ఈ బ్యూటీ. తాజాగా ఈమెకు సంబంధించిన చైల్డ్హుడ్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.