Tollywood Heroine : టాలీవుడ్ లో కొన్ని విచిత్రమైన కాంబినేషన్స్ ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలకు కూతురుగా నటించిన శ్రీదేవి,కాస్త పెద్దయ్యాక వాళ్ళ సరసన హీరోయిన్ గా నటించి అందరినీ షాక్ కి గురి చేసింది. అడవి రాముడు సమయం లో ఎన్టీఆర్ పై ఈ విషయం లో ట్రోల్స్ కూడా నడిచేవి అట అప్పట్లో. నేటి తరం స్టార్ హీరోయిన్స్ లో ఇలాంటివి ఎక్కువగా నయనతార కి జరుగుతున్నాయి. ఉదాహరణకు ‘సై రా నరసింహా రెడ్డి’ చిత్రం లో నయనతార చిరంజీవి కి జోడీగా నటించింది. అదే నయనతార(Nayanathara) ‘గాడ్ ఫాదర్’ లో చిరంజీవి కి చెల్లి గా నటించి, త్వరలోనే అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమాలో మళ్ళీ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించనుంది.
Also Read : రజినీకాంత్ కూతురుతో తమిళ హీరో విశాల్ పెళ్లి ఫిక్స్..? మామూలు ట్విస్ట్ కాదుగా!
ఇదే నయనతార గతం లో బాలయ్య బాబు(Nandamuri Balakrishna) అమ్మగా నటించి, ప్రభాస్(Rebel Star Prabhas) కి హీరోయిన్ గా కూడా నటించింది అనే విచిత్రమైన విషయం మీకు ఎవరికైనా తెలుసా?. పూర్తి వివరాల్లోకి వెళ్తే నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన సింహా చిత్రం 2007 వ సంవత్సరం లో విడుదలై ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య బాబు డ్యూయల్ రోల్ లో నటించాడు. పెద్ద బాలయ్య కి జోడీ గా నయనతార నటించింది. వీళ్లిద్దరు కొడుకే చిన్న బాలయ్య. ఆ విధంగా బాలయ్య కి తల్లిగా నటించిన నయనతార, బాలయ్య కంటే చిన్న వయస్సు ఉన్నటువంటి ప్రభాస్ తో కలిసి ‘యోగి’ చిత్రం లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ విచిత్రమైన కాంబినేషన్స్ సెట్ అయ్యాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి సందర్భాలు నయనతార కి రిపీట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.
ఇదంతా పక్కన పెడితే నయనతార తన ప్రతీ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కానీ, ప్రొమోషన్స్ కి కానీ హాజరు అవ్వదు అనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ రేపటి నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ చిత్రానికి మాత్రం ఆమె ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఒప్పుకుంది. ఆమె ఈ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టే సందర్భాన్ని అనిల్ రావిపూడి తన స్టైల్ మేకింగ్ లో ఎలా చూపించాడో రీసెంట్ గా మనమంతా చూసాము. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే భవిష్యత్తులో నయనతార ని ప్రొమోషన్స్ విషయం లో ఒక రేంజ్ లో వాడుకోబోతున్నాడు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. నయనతార లోని ఈ యాంగిల్ కాస్త అందరికీ కొత్తగా అనిపించొచ్చు. కానీ సినిమాకు పది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది కదా, ఆ మాత్రం చేయక తప్పదులే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు.