Tollywood Heroine: కొంతమంది వరుసగా సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటుంటే మరి కొంతమంది మాత్రం ఎంత ప్రయత్నించినా కూడా హిట్స్ అందుకోలేకపోతున్నారు. వరుసగా అవకాశాలు వచ్చినప్పటికీ వాళ్ల ఖాతాలో హిట్ మాత్రం పడడం లేదు. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా మంది ముద్దుగుమ్మలు గుర్తింపు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేస్తూ ఆచితూచి ముందుకు దూసుకుపోతున్నారు. వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్న కూడా ఇప్పటివరకు గుర్తింపు అందుకొని ముద్దుగుమ్మలు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్నది కూడా ఈ జాబితాకు చెందిందే. తనకు అందం, అభినయం ఉన్నప్పటికీ కూడా ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో గుర్తింపు అందుకోలేకపోయింది. తెలుగులో ఈ బ్యూటీ ఇప్పటివరకు దాదాపు 17 సినిమాలకు పైగా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కూడా అయ్యాయి. కానీ అనుకున్న స్థాయిలో స్టార్డం మాత్రం తెచ్చుకోలేకపోయింది.
Also Read:మన ఇండస్ట్రీ నుంచి అలాంటి సినిమాలు ఎందుకు రావడం లేదు…
ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోయిన్ లో స్టార్ డం కోసం ఎంతో కష్టపడతారు. వారిలో హీరోయిన్ కేథరిన్ త్రెసా కూడా ఒకరు. ఈమె అసలు పేరు కేథరిన్ త్రెసా అలెగ్జాండర్. ఈమె తెలుగుతోపాటు పలు తమిళ సినిమాలలో కూడా నటించి మెప్పించింది. ఈమె దుబాయ్లో స్థిరపడిన మలయాళీ క్రైస్తవ కుటుంబంలో పుట్టింది. కేథరిన్ చదువుతోపాటు పియానో, గానం, నృత్యం, ఐ సి స్కేటింగ్ మరియు డిబేటింగ్లో ప్రత్యేక శిక్షణ అందుకుంది. దుబాయ్ లో ఉంటున్న సమయంలో ఈ చిన్నది ఎమిరేట్స్ ఎన్విరాన్మెంట్ వాలంటీర్ గా కూడా పనిచేసింది. తెలుగులో ఈమె 17 సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.
కానీ ఈమెకు అనుకున్న స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చమ్మక్ చల్లో సినిమాతో 2013లో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమయ్యింది కేథరిన్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పరాజయం పొందినప్పటికీ తన నటనతో అందంతో విమర్శకులు నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. అలాగే తెలుగులో నాని సరసన పైసా, అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో అలాగే సరైనోడు, హీరో రానాకు జోడిగా నేనే రాజు నేనే మంత్రి, గోపీచంద్ తో గౌతమ్ నంద వంటి సినిమాలలో నటించింది. స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. జయ జానకి నాయక సినిమాలో ఈ చిన్నది స్పెషల్ సాంగ్లో నటించింది.
Also Read: ఓదెల రైల్వే స్టేషన్ 2′ ఫుల్ మూవీ రివ్యూ…
View this post on Instagram