Film Industry : ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా మంచి సినిమాలు వచ్చాయి. ఇక మీదట నుంచి కూడా భారీ సినిమాలను తీయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా ఇక మీదట చేయబోయే సినిమాలు సైతం భారీ సక్సెస్ లను సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియాలో తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలో మనవాళ్ళు ఇప్పుడు హిస్టారికల్ సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదు…నిజానికి ఇంతకు ముందు బాహుబలి, రుద్రమదేవి, సైరా లాంటి సినిమాలు వచ్చినప్పటికి ఇప్పుడు మాత్రం హిస్టారికల్ డ్రామాలను వారియర్ ఎపిక్ లుగా మార్చడం లో మాత్రం మనవాళ్ళు చాలా వరకు వెనకబడిపోయారు…ఇక రీసెంట్ గా బాలీవుడ్ లో విక్కీ కౌశల్ (Vickky Koushal) హీరోగా వచ్చిన ఛావా(Chhava) సినిమా సూపర్ సక్సెస్ అయింది. మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ కొడుకు అయిన శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ లో మంచి విజయాన్నిందించింది. అన్ని భాషల్లో భారీ విజయాన్ని దక్కించుకుంది. అయితే మన దర్శకులు మన హీరోలను పెట్టీ ఇలాంటి సినిమాలు చేస్తే సూపర్ సక్సెస్ అయ్యేవి కదా తద్వారా మన ఇండస్ట్రీ కి మంచి గుర్తింపు లభించేది.
అలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అంటూ సినిమా విమర్శకులు సైతం విమర్శిస్తున్నారు. ఇక ప్రస్తుతం రిషబ్ శెట్టి హీరోగా చటపతి శివాజీ జీవిత కథ ఆధారంగా ఒక సినిమా చేస్తున్నారు…కనీసం ఈ సినిమా అయిన మన వాళ్ళు చేస్తే భారీ విజయాన్ని దక్కించుకునేదేమో అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు…
ఇక మొత్తానికైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసిస్తున్న మన హీరోలు ఇక మీదట రాబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు…ఇక మన స్టార్ హీరోలు ఎప్పుడు కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి చారిత్రాత్మకమైన సినిమాలు చేస్తే బాగుంటుంది.
లేకపోతే మాత్రం మనం ఎన్ని సినిమాలు చేసి ఎన్ని సక్సెస్ లను సాధించిన ఎన్ని రికార్డ్ లను క్రియేట్ చేసిన కూడా మన ఇండస్ట్రీ కి గొప్ప గా చెప్పుకునే సినిమాలు మాత్రం ఉండవనే చెప్పాలి…చూడాలి మరి ఇక మీదట అయిన మనవాళ్ళు అలాంటి సినిమాలు చేస్తారా లేదా అనేది.
Also Read : వెన్నుపోటు లో కట్టప్పనే మించిపోయిన రష్మిక..’పుష్ప’ విషయంలో ఇంత మోసమా!