Tollywood Heroes Remuneration: తెలుగు చిత్ర పరిశ్రమ తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాక ఇండస్ట్రీలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. అలనాటి సీనియర్ హీరోలు ఎన్టీయార్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ లాంటి వారు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత విక్టర్ వెంకటేశ్ తండ్రి నిర్మాత డి రామానాయడు, దర్శక రత్న దాసరి రావు ఇండస్ట్రీకి కొత్త రూపం తీసుకొచ్చారు. అక్కినేని కుటుంబం అన్నపూర్ణ స్టూడియోస్, కృష్ణ కుటుంబం పద్మాలయ స్టూడియోస్‌ను ప్రారంభించింది. తర్వాత చాలా ప్రొడక్షన్ హౌస్‌లు కూడా వచ్చాయి. అందులో నాటి నుంచి నేటి వరకు విజయవంతంగా కొనసాగుతున్నది సురేశ్ ప్రొడక్షన్స్..
అయితే, 1980ల్లో తమిళ సినిమాలకు దీటుగా తెలుగు సినిమాలు పెద్ద ఎత్తున విడుదలయ్యేవి. చెన్నై ఫిలిం ఇండస్ట్రీ చాలా పెద్దది. అందులో పెద్ద పెద్ద టెక్నిషియన్లు ఉండేవారు. హైదరాబాద్ ఫిలిం ఇండస్ట్రీలో నిలదొక్కుకునేంత వరకు అక్కడి టెక్నిషియన్లు తెలుగు సినిమాలకు పనిచేశారు. అప్పట్లో సినీ హీరోలకు ప్రస్తుతం ఉన్నట్టు కోట్లల్లో రెమ్యూనరేషన్ ఇచ్చేవారు కాదు. ఆనాడు సినిమాలకు వందల కోట్ల బడ్జెట్ కూడా లేదు. అప్పట్లో అతిపెద్ద బడ్జెట్ సినిమాలు అంటే ఎన్టీఆర్‌వి మాత్రమే ఉండేవి. ఈయన సినిమాలకు హైయ్యేస్ట్ రూ.50లక్షలు ఖర్చుచేసేవారు. రెమ్యూనరేషన్ విషయంలోనూ అన్నగారే టాప్. ఈయన సినిమాకు రూ.12 లక్షలు తీసుకునే వారట.. సౌత్ ఇండస్ట్రీలోనే ఇది టాప్ రెమ్యూనరేషన్.
Also Read: చిరంజీవిని తొక్కామని సంబరపడి.. తెలుగు ఇండస్ట్రీని ముంచేశారు?
అన్నగారి తర్వాత అక్కినేని నాగేశ్వరరావు సినిమాలకు రూ.30 నుంచి 40లక్షల బడ్జెట్ అయ్యేది. ఈయన ఒక్కో సినిమాకు రూ.10లక్షల వరకు తీసుకునేవారు. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలకు కూడా 20 నుంచి 30 లక్షల బడ్జెట్ అయ్యేది. ఈయన 7లక్షల వరకు తీసుకునేవారు. అందుకే ఈయనతో నిర్మాతలు ఎక్కువగా సినిమాలు తీసి కోట్లు సంపాదించారు.
ఇక శోభన్ బాబు సినిమాలకు 20 నుంచి 25 బడ్జెట్ అవుతుండగా, 6 నుంచి 7లక్షల రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఇండస్ట్రీలో ఒకప్పుడు చిరంజీవి కంటే సుమన్‌కు ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. ఈయన సినిమాకు 17లక్షల బడ్జెట్ అవుతే రూ. 3లక్షల పారితోషికం తీసుకునేవారు. ఇక చిరంజీవి సినిమాలకు రూ.17లక్షల బడ్జెట్ అనుకుంటే రూ.3 నుంచి 4లక్షల పారితోషికం తీసుకునే వారని తెలిసింది.