IMDB: ‘ఆర్ఆర్ఆర్’ సృష్టిస్తున్న రికార్డుల దెబ్బకు భారతీయ సినీ లోకమంతా.. సంతోషంతో సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది, తాజాగా ఆర్ఆర్ఆర్ కు మరో అద్భుతమైన గౌరవం దక్కింది. ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ సంస్థ (ఐఎండీబీ – IMDB)లో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ లిస్ట్ లో ఉన్న ప్రపంచవ్యాప్త టాప్ 5 సినిమాల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఒకటిగా నిలిచింది.
అలాగే ఏకైక ఇండియన్ సినిమాగానూ రికార్డు సాధించింది. ఇప్పటికే అనేక రికార్డులను బ్రేక్ చేసిన ఈ సినిమా ఈ అరుదైన ఘనత దక్కించుకోవడం విశేషం. పైగా ఇతర హాలీవుడ్ సినిమాలకు మించి ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఎక్కువ రేటింగ్ ఉండటం తెలుగు సినీ ఇండస్ట్రీకే గర్వకారణం. నేషనల్ రేంజ్ విజువల్ డైరెక్టర్ గా రాజమౌళికి ఇప్పటికే అద్భుతమైన పేరు ఉంది. ఈ సినిమాతో ఆ పేరు రెట్టింపు అయ్యింది.
Also Read: Mishan Impossible Box Office Collection: చేతులెత్తేసిన తాప్సీ అభాసుపాలైన మెగాస్టార్
పైగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. ఒక తెలుగు సినిమాకి ఈ స్థాయి కలెక్షన్సా ? అంటూ ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యచకితులు అవుతున్నారు. ఎంత విపరీతమైన అంచనాల మధ్య రిలీజ్ అయితే మాత్రం.. అసలు రోజురోజుకు వందల కోట్లును కలెక్ట్ చేయడం అంత సామాన్యమైన విషయం కాదు. కానీ ఆర్ఆర్ఆర్ చిత్రం ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించింది.
ఏది ఏమైనా ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా వచ్చిన ఈ క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది. మరి ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులను నెలకొల్పి.. ఏ స్థాయి చరిత్రను సృష్టిస్తుందో చూడాలి. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.
ఈ సినిమా 10 రోజులకు గానూ అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 494.20 కోట్లు కలెక్ట్ చేసింది. ఒక తెలుగు సినిమా ఫస్ట్ టెన్ డేస్ కలెక్షన్స్ లో కూడా ఈ రేంజ్ ఫిగర్ ను నెలకొల్పడం సరి కొత్త రికార్డ్. అందుకే ఈ కలెక్షన్స్ చూసి.. ఇది తెలుగు వాడి సింహగర్జన అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:Dil Raju Party Rajamouli Naatu Step: పార్టీలో రాజమౌళి చేసిన పనికి అందరూ షాక్