Megastar Chiranjeevi- Taapsee Pannu:: టాలెంటెడ్ బ్యూటీ తాప్సీ పన్ను తెలుగులో చాలా గ్యాప్ తర్వాత చేసిన `మిషన్ ఇంపాజిబుల్` సినిమాని మెగాస్టార్ చిరంజీవి కూడా బాగా ప్రమోట్ చేశారు. కారణం.. ఈ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి మెగాస్టార్ ఆచార్య సినిమాకు నిర్మాత కావడంతో.. ఈ సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెప్పక చిరంజీవికి తప్పలేదు.
అయితే.. నా మీద నమ్మకం పెట్టుకోండి ఈ సినిమా మీకు నచ్చుతుంది అంటూ చిరు కాస్త ఎక్కువ అభయం ఇచ్చేశారు. కట్ చేస్తే.. సినిమా రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద బీద అరుపులతో మొత్తానికి ఫస్ట్ వీక్ లోనే తట్టాబుట్టా సర్ధేసుకునే పరిస్థితికి వచ్చేసింది. ఏప్రిల్ 1న విడుదలైన ఈ సినిమా మొదటి షోతో నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుని వసూళ్ళ పరంగా మొదటి రోజే పూర్తిగా తేలిపోయింది. ఇక రెండో రోజు అయితే.. బాగా డౌన్ అయ్యింది.
Also Read: Janasena BJP Alliance: పవన్ కళ్యాణ్ పై ఫుల్ క్లారిటీ.. అందరి ఫోకస్ జనసేనానిపైనే..
ఇంతకీ ఈ సినిమాకి వచ్చిన ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను ఏరియాల వారీగా ఒకసారి గమనిస్తే :
నైజాం: 0.26 కోట్లు
సీడెడ్: 0.14 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.18 కోట్లు
ఈస్ట్ + వెస్ట్: 0.06 కోట్లు
కృష్ణా + గుంటూరు: 0.08 కోట్లు
నెల్లూరు: 0.05 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లకు గానూ 0.77 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్: 0.05 కోట్లు
మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లకు గానూ 0.82 కోట్లు కలెక్ట్ చేసింది.
తాప్సీకి హిందీలో కూడా మార్కెట్ ఉంది. ఆమె ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అంటూ మీడియా ఇచ్చిన బిల్డప్ కి.. ‘మిషన్ ఇంపాజిబుల్’కి వచ్చిన కలెక్షన్స్ కు ఎక్కడా పొంతన లేదు. నిజానికి ఈ చిత్రానికి రూ.2.22 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే కనీసం రూ.2.5 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది. కానీ కోటి కూడా కలెక్ట్ చేసే స్థితిలో ‘మిషన్ ఇంపాజిబుల్’ లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ అవ్వడం కష్టమే. మొత్తానికి నిర్మాత నిరంజన్ రెడ్డిని తాప్సీ అడ్డంగా ముంచేసింది.
Also Read:Pub Drugs Case: ఏ3గా అర్జున్ వీరమాచినేని.. ఈయన నందమూరి ఫ్యామిలీ అని తెలుసా?