Bigg Boss 9 Telugu Bharani Elimination: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కంటెస్టెంట్ భరణి. సినిమాల్లో, సీరియల్స్ లో ఎక్కువగా విలన్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన ఈయన, నిజ జీవితం లో ఎంతో మంచి వాడు అని బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఆడియన్స్ చేత అనిపించుకున్నాడు. అంతే కాకుండా హౌస్ లో ప్రతీ కంటెస్టెంట్ కి ఈయన బాగా కనెక్ట్ అయిపోయాడు. ముఖ్యంగా తనూజ, దివ్య, సుమన్ శెట్టి, రాము రాథోడ్ వంటి వారితో ఈయన మైంటైన్ చేసిన రిలేషన్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఈ సీజన్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకుందంటే, అందుకు భరణి బంధాలు కూడా కారణం అని చెప్పొచ్చు.
అయితే ఈ బంధాల కారణంగా ఒకసారి ఆయన గేమ్ బాగా ఎఫెక్ట్ అయ్యి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఎలిమినేట్ అయినా తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. రీ ఎంట్రీ తర్వాత తన ఆట తీరుని పూర్తిగా మార్చుకొని, తనలోని కామెడీ యాంగిల్ ని కూడా బయటకు తీసి, ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసాడు. టాప్ 5 లోకి కచ్చితంగా వెళ్లాడని అనుకున్నారు కానీ, చివరికి టాప్ 6 కంటెస్టెంట్ గా నేడు ఆయన హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు. ఇది ఆయన అభిమానులకు తీవ్రమైన నిరాశని కలిగించే విషయం. ఎలిమినేషన్ రౌండ్ సంజన, భరణి మధ్య జరగ్గా, సంజన సేవ్ అయ్యి భరణి ఎలిమినేట్ అయ్యాడు. గత వారం వరకు భరణి కి సంజన కంటే ఎక్కువ ఓటింగ్ నమోదు అవుతూ వచ్చింది. కానీ ఈ వారం ఆమెని హౌస్ లో కంటెస్టెంట్స్ ఎక్కువగా టార్గెట్ చేయడం వల్ల, ఆడియన్స్ ఆమెని ఎలా అయినా టాప్ 5 లోకి తీసుకెళ్లాలి అనే కసితో ఓట్లు వేసినట్టు తెలుస్తోంది.
కానీ సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న మరో వార్త ఏమిటంటే, భరణి కి టాప్ 4 స్థానం లో భారీ ఓటింగ్ పడిందని, డిమోన్ పవన్ కి అతి తక్కువ ఓట్లు పడ్డాయని, కానీ భరణి రీ ఎంట్రీ నాగబాబు రికమండేషన్ వల్ల జరిగింది అంటూ సోషల్ మీడియా లో పెద్ద ప్రచారం అవ్వడం, ఆ తర్వాత కొన్నాళ్ళకు అక్కినేని నాగార్జున తో నిహారిక కొణిదెల భరణి గురించి మాట్లాడడం చూసి, నెటిజెన్స్ ఆయన్ని టాప్ 5 కి మ్యానేజ్మెంట్ కోటాలో పంపడానికి ఫిక్స్ అయినట్టు ఉన్నారు అంటూ విపరీతంగా విమర్శలు చేస్తూ బిగ్ బాస్ 9 పై నెగిటివిటీ ని పెంచారు. ఇలాంటి పరిస్థితి లో డిమోన్ పవన్ ని ఎలిమినేట్ చేస్తే పెద్ద రచ్చ చేస్తారని భరణి ని ఎలిమినేట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి, ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.