Tollywood : ప్చ్.. గొప్ప నటులే కానీ గుర్తింపు లేదు !

Tollywood: తెలుగు సినీరంగంలో గొప్ప నటులు చాలామంది ఉన్నారు. అయితే, గొప్ప నటన ఉన్నప్పటికీ.. సరియైన గుర్తింపు రాక.. సాధారణ నటులుగా మిగిలిపోయిన నటులు చాలామంది ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు చెప్పుకుంటే.. మొదట సూపర్ హిట్ చిత్రాలలో నటించి ఆ తర్వాత కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొని చివరకు ఛాన్స్ లు కూడా రాక ఇబ్బంది పడిన నటులు ఉన్నారు. ఒకప్పుడు తెలుగు సినీ రంగంలో జానపద చిత్రాలంటే కాంతారావు.. ఆ తర్వాత ఎన్టీఆర్ […]

Written By: admin, Updated On : September 4, 2021 4:22 pm
Follow us on

Tollywood: తెలుగు సినీరంగంలో గొప్ప నటులు చాలామంది ఉన్నారు. అయితే, గొప్ప నటన ఉన్నప్పటికీ.. సరియైన గుర్తింపు రాక.. సాధారణ నటులుగా మిగిలిపోయిన నటులు చాలామంది ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు చెప్పుకుంటే.. మొదట సూపర్ హిట్ చిత్రాలలో నటించి ఆ తర్వాత కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొని చివరకు ఛాన్స్ లు కూడా రాక ఇబ్బంది పడిన నటులు ఉన్నారు.

ఒకప్పుడు తెలుగు సినీ రంగంలో జానపద చిత్రాలంటే కాంతారావు.. ఆ తర్వాత ఎన్టీఆర్ మాత్రమే గుర్తుకువచ్చేవారు. 1980 ల్లో దాదాపు జానపద చిత్రాలు నెమ్మదిగా కనుమరుగవుతున్న రోజులలో.. చాలా తక్కువ బడ్జెట్టుతో దర్శకుడు విఠలాచార్య గారు తీసే సినిమాలలో నరసింహరాజు హీరోగా కనిపించేవారు. జగన్మోహిని, పున్నమినాగు లాంటి చిత్రాలలో ఆయనే హీరో. కానీ ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఎక్కువకాలం హీరోగా నిలబడలేకపోయారు.

ప్రేమదేశం సినిమాతో టాలీవుడ్‌తో (Tollywood) పాటు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న హీరో అబ్బాస్. అప్పట్లో తెలుగులో లెక్కలేనన్ని సినిమాలు చేశాడు అబ్బాస్. అయితే చాలా తక్కువ సమయంలోనే ఆయన కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. మంచి టాలెంట్ ఉన్నా.. ఆ తర్వాత సైడ్ హీరో పాత్రలకు, క్యారెక్టర్ ఆర్టిస్ మాదిరి పాత్రలకే ఆయన పరిమితమైపోయాడు. మొత్తానికి తన టాలెంట్‌‌ను సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు.

“మహర్షి”రాఘవ’.. మహర్షి సినిమలోని తన పాత్రలో జీవించాడు. ఆ పాత్ర యొక్క మానసిక సంఘర్షణను ఎంతో చక్కగా తన హావభావాలలో చూపించాడు. కానీ ఆ తరువాత ఎందుకో ఆయనకు తగిన గుర్తింపు రాలేదు.

క్యారెక్టర్ ఆర్టిస్టులలో షఫీది విభిన్న శైలి. చాలా మంచి నటుడు , నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా నుండి వచ్చారు , గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. ఖడ్గం సినిమా లో ప్రతినాయకుడు పాత్రలో, ఛత్రపతి లో ప్రభాస్ తమ్ముడిగా షఫీ నటన ఎప్పటికి గుర్తుండిపోతుంది. కానీ షఫీ కి ఎందుకో రావాల్సినంతగా మంచి పేరు రాలేదు. ప్రస్తుతం ఛాన్స్ లు కూడా రావడం లేదు.

ఇంకో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరు ‘సూర్య’. అన్ని రకాల పాత్రలను అవలీల గా చేయగలరు. మంజుల ఘట్టమనేని తీసిన షో సినిమా లో అతని నటన చాలా చాలా బాగుంటుంది. కానీ చిన్న పాత్రలకు మాత్రమే క్యారెక్టర్ ఆర్టిస్ట్ సూర్య పరిమితం అయిపోయారు. ఇలా చాలామందే ఉన్నారు.