Tollywood drug case : ఎవరెవరి జాతకాలు బయట పడతాయో ?

Tollywood drug case: టాలీవుడ్ (Tollywood) చుట్టూ ప్రసుతం డ్రగ్స్ కేసులు (drug case) తిరుగుతున్నాయి తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ ప్రారంభమైంది. మరి ఈ విచారణలో ఎవరెవరి జాతకాలు బయట పడతాయో చూడాలి. ఇప్పటికే డేర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ ఈ రోజు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యాడు. డ్రగ్ కేసుకు సంబంధించి పలు కీలక అంశాల పై ఈడీ అధికారులు పూరిని ప్రశ్నించారు. కాగా ఇప్పటికే ఈ డ్రగ్ కేసుకు సంబంధించి […]

Written By: admin, Updated On : August 31, 2021 1:32 pm
Follow us on

Tollywood drug case: టాలీవుడ్ (Tollywood) చుట్టూ ప్రసుతం డ్రగ్స్ కేసులు (drug case) తిరుగుతున్నాయి తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ ప్రారంభమైంది. మరి ఈ విచారణలో ఎవరెవరి జాతకాలు బయట పడతాయో చూడాలి. ఇప్పటికే డేర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ ఈ రోజు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యాడు. డ్రగ్ కేసుకు సంబంధించి పలు కీలక అంశాల పై ఈడీ అధికారులు పూరిని ప్రశ్నించారు.

కాగా ఇప్పటికే ఈ డ్రగ్ కేసుకు సంబంధించి 12మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరి ఆ ప్రముఖుల లిస్ట్ విషయానికి వస్తే.. ఈ కింది పట్టిక గమనించగలరు. అలాగే వాళ్ళు విచారణకు హాజరవ్వాల్సి తేదీలను కూడా పొందుపరచడం జరిగింది.

1. పూరి జగన్నాథ్‌ – ఆగస్టు 31 ఈ రోజు విచారణకు హాజరయ్యారు.

2.ఛార్మి – సెప్టెంబర్‌ 2న విచారణకు హాజరు కానుంది.

3.రకుల్‌ప్రీత్‌ సింగ్‌ – సెప్టెంబర్‌ 6 న విచారణకు హాజరు కానుంది.

4.రాణా దగ్గుబాటి – సెప్టెంబర్‌ 8న విచారణకు హాజరు కానున్నాడు.

5.రవితేజ – సెప్టెంబర్‌ 9 న విచారణకు హాజరు కానున్నాడు.

6.శ్రీనివాస్‌ – సెప్టెంబర్‌ 9 న విచారణకు హాజరు కానున్నాడు.

7.నవదీప్‌ – సెప్టెంబర్‌ 13 న విచారణకు హాజరు కానున్నాడు.

8 ఎఫ్‌ క్లబ్‌ జీఎం – సెప్టెంబర్‌ 13 న విచారణకు హాజరు కానున్నాడు.

9.ముమైత్‌ ఖాన్‌ – సెప్టెంబర్‌ 15న విచారణకు హాజరు కానుంది.

10.తనీష్‌ – సెప్టెంబర్‌ 17 న విచారణకు హాజరు కానున్నాడు.

11.నందు – సెప్టెంబర్‌ 20 న విచారణకు హాజరు కానున్నాడు.

12.తరుణ్‌ – సెప్టెంబర్‌ 22న విచారణకు హాజరు కానున్నాడు.

ఈ డ్రగ్స్ కేసులు కలకలం ఒక్క బాలీవుడ్, శాండల్ వుడ్‌ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా గతంలోనే ప్రకంపనలను సృష్టిస్తోంది. అప్పుడు టాలీవుడ్ లో నమోదు అయిన డ్రగ్ కేసులు సమాప్తం అయిపోయాయని భావించారు. ఓ దశలో ఈ కేసులు మరుగున పడిపోయాయి కూడా . మళ్లీ ఇన్నాళ్లకు డ్రగ్ కేసుల పునాదులు కదిలేలా కనిపిస్తున్నాయి.