Tollywood:ఇటీవల సినిమాలు సక్సెస్ కావడానికి ఎంతో శ్రమించాల్సి వస్తోంది. కొందరు నిర్మాతలు ప్రేక్షకులను అనుగుణంగా కాకుండా వారి డబ్బు సంపాదన కోసమే సినిమాలు తీస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. దీంతో కొందరు స్టార్ హీరోలపై ఇంప్రెస్ తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో తదనంతరం వచ్చిన వారి సినిమాలను అభిమానుల సైతం ఆదరించడం లేదు. ఇలా చేయడం ఇబ్బందికరంగా ఉందని కొందరు స్టార్ నటులు వేదికలపై ప్రస్తావించారు. తాజాగా స్టార్ నటులు అక్షయ్ కుమార్, రామ్ చరణ్ ఓ ఇంగ్లీష్ పేపర్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రస్తుతం సినిమాలపై వారి వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

కరోనా రావడంతో ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయని, సినిమాలపై ఎక్కువగా ఖర్చు పెట్టడం లేదని ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ అన్నారు. దీంతో వారు థియేటర్లు కాకుండా ఓటీటీ నీ ఆశ్రయిస్తున్నారన్నారు. అయితే మంచి కథతో వస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తుంటారు. కానీ ఈరోజుల్లో వచ్చే కథల్లో బలం ఉండడం లేదు. ప్రస్తుతం హిందీలో ప్రేక్షకులను మెప్పించగల సినిమాలు తీయలేకపోతున్నామని అన్నారు. ఇండస్ట్రీ అంతా చర్చించుకొని ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు ఇవ్వాలో నిర్ణయించుకోవాలని అవసరం ఉంది. అప్పుడే సినీ ఇండస్ట్రీ మనుగడ సాగుతుందని అన్నారు.
ఇక తెలుగు స్టార్ నటుడు రామ్ చరణ్ మాట్లాడుతూ ‘రీసెంట్ గా నేను నటించిన ‘ట్రిపుల్ ఆర్’ మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత ఊహించని రీతిలో సక్సెస్ సాధించింది. ఈ సినిమాకు ఇంత స్పందన వస్తుందని మేం కూడా ఊహించలేదు. ఇప్పుడు జపాన్ లో కూడా సినిమాను ఆదరించడం శుభ పరిమాణం. అయితే ఒకప్పుడు స్టార్ హీరోల ఫొటోలు మ్యాగ్జిన్ పై వస్తే ఆ ఫొటో కోసం దానిని తెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు సినిమాలు వస్తున్నా ప్రేక్షకులు ఆదరించడం కష్టంగా ఉంది. కథ బాగుంటే ప్రేక్షకులను ఎవరూ ఆపలేరు’ అని అన్నారు.
అయితే ఈ హీరోలు ఎలా చెబుతున్నా.. సినిమా టికెట్ల రేట్ల విషయంలోనూ ప్రేక్షకుల్లో అసంతృప్తి ఉంది. ఇప్పటికే ఆర్థిక మాంద్యం, నిరుద్యోగంతో బాధపడుతున్న రోజుల్లో వినోదంపై వెచ్చించేవారు కరువయ్యారు. ఒకప్పుడు పైరసీలు వచ్చినా సినిమా టికెట్ రేట్స్ తక్కువగా ఉండడంతో ప్రేక్షకులు థియేటర్ లో చూసేందుకు ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు టికెట్ ధరలు భారీగా పెంచి.. వీక్ కలెక్షన్స్ వస్తే చాలు అనుకోవడం తో సినిమా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడం లేదు. అయితే మంచి కథలు ఉన్న సినిమాలు లేకపోలేదు. కానీ ఈ రోజుల్లో ప్రమోషన్ చేసే సినిమాపైనే ప్రేక్షకులు ఫోకస్ పెడుతున్నారు. పెద్ద సినిమాల తాకిడితో చిన్న సినిమాల గురించి తెలియకుండా పోతుంది.