Anasuya Bharadwaj: అనసూయ విషయంలో వయసు జస్ట్ నంబర్ మాత్రమే. నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్నా అనసూయ అందం ఇంచు కూడా తగ్గలేదు. ఆమె వన్నె తరగని గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తుంది. అనసూయ పరిశ్రమకు కొంచెం ఆలస్యంగా వచ్చింది కానీ లేదంటే స్టార్స్ హీరోయిన్స్ కి మోత మోగేది. తాజాగా టాప్, ఫ్రాక్ ధరించి గుండెల్లో గుబులు రేపింది. అనసూయ సూపర్ గ్లామరస్ లుక్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. ఇక ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.
సోషల్ మీడియాలో అనసూయ విపరీతమైన నెగిటివిటీ ఫేస్ చేస్తుంది. సెలబ్రిటీలపై నెగిటివ్ కామెంట్స్ సాధారణం. చాలా మంది చూసి చూడనట్లు వదిలేస్తారు. అనసూయ ఆ టైప్ కాదు. వెంటనే రియాక్ట్ అవుతుంది. హద్దులు దాటి ప్రవర్తించినా, కామెంట్స్ చేసినా… చర్యలకు సిద్ధం అవుతుంది. సైబర్ క్రైమ్ విభాగంలో పలువురు నెటిజెన్స్ పై కేసులు పెట్టి జైలుపాలు చేసింది.
ఆ సంగతి అటుంచితే అనసూయ నటిగా ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. ఆమె లేటెస్ట్ మూవీ పెదకాపు 1 ఇటీవల విడుదలైంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రంలో అనసూయ కీలక రోల్ చేసింది. అయితే మూవీ నిరాశపరిచింది. పది కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన పెదకాపు 1 కనీసం కోటి రూపాయల షేర్ రాబట్టలేదు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు ఇది ఊహించని షాక్ అని చెప్పొచ్చు.
నెక్స్ట్ అనసూయ పుష్ప 2 చిత్రంలో అలరించనుంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగంలో దాక్షాయణిగా కనిపించిన అనసూయ మరోసారి అదే పాత్రలో విలనిజం చూపించనుంది. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.
ఇటీవల విడుదలైన రంగమార్తాండ, విమానం చిత్రాల్లో అనసూయ కీలక రోల్స్ చేశారు. ఓ తరహా పాత్రలకు అనసూయ కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. విమానం మూవీలో వేశ్యగా నటించి తన గట్స్ ఏమిటో నిరూపించుకుంది. ఇక అనసూయ యాంకరింగ్ మానేశారు. ఇకపై ఆమె యాంకరింగ్ చేయడం జరగని పనే…
View this post on Instagram