Tollywood Comedians : టాలీవుడ్ లో టాలెంటెడ్ కమెడియన్స్ ఉన్నారు. బ్రహ్మానందం, అలీ, కోటా లాంటి నటులు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించారు. వెయ్యి చిత్రాలు అంటే మాటలు కాదు. కొందరు కమెడియన్స్ కి ఉన్న డిమాండ్ అలాంటిది మరి. ఈ కమెడియన్స్ మూడు షిఫ్ట్ లు పని చేస్తారు. మరి స్టార్ కమెడియన్స్ ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో చూద్దాం…
బ్రహ్మానందం పరిశ్రమను శాసించిన కమెడియన్. గిన్నిస్ రికార్డు సాధించారు. నాలుగు దశాబ్దాలు నిరంతరం నటించారు. ప్రస్తుతం ఆరోగ్య కారణాలతో సినిమాలు తగ్గించారు. ఒక దశలో ఆయన కాల్షీట్ కి రూ. 5-7 లక్షలు తీసుకున్నారు. వెన్నెల కిషోర్ స్టార్ కమెడియన్ గా అవతరించారు. ఆయన రెమ్యూనరేషన్ రూ. 2-3 లక్షలు.
సునీల్ తిరుగులేని కమెడియన్ గా రెండు దశాబ్దాలు కొనసాగాడు. హీరోగా మారి ఆ ఇమేజ్ పోగొట్టుకున్నారు. ప్రస్తుతం విలన్ గా కూడా చేస్తున్నారు. సునీల్ రెమ్యూనరేషన్ దాదాపు రూ.4 లక్షలు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై హీరోగా, కమెడియన్ గా వందల చిత్రాలు చేసిన అలీ ప్రస్తుతం రూ. 3.5 లక్షలు తీసుకుంటున్నారని సమాచారం. సప్తగిరి తారాజువ్వలా ఎగసి మరలా కింద పడ్డాడు. కమెడియన్ గా ఎదిగే రోజుల్లో హీరోగా మారి దెబ్బతిన్నాడు. సప్తగిరి రెమ్యూనరేషన్ రూ. 2 లక్షలు.
రచయితగా పరిశ్రమలో అడుగుపెట్టిన పోసాని డైరెక్టర్, హీరోగా కూడా రాణించారు. ప్రస్తుతం ఆయన రెమ్యూనరేషన్ రూ. 2.5 లక్షలు. ఈ జనరేషన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ. ఈయన రూ. 2 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. రాహుల్ రామకృష్ణ మిత్రుడు ప్రియదర్శి రూ. 2 లక్షలు తీసుకుంటున్నాడట. ఇక సీనియర్ కమెడియన్స్ లో ఒకరైన శ్రీనివాసరెడ్డి కూడా రూ. 2 లక్షలు తీసుకుంటున్నారట. 30 ఇయర్స్ పృథ్వి సైతం రూ. 2 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నాడని సమాచారం.