Top Five 125cc Scooters : యూత్ కొత్త బైక్ కొనాలంటే అనేక విషయాలు పరిశీలిస్తారు. మోడల్, డిజైన్, ఇంజిన్ కెపాసిటీ, ఫీచర్లు అన్నింటి గురించి ఆరా తీస్తారు. అయితే చాలామంది మినిమం 125 సీసీ ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైక్‌నే ప్రిఫర్ చేస్తుంటారు. ఇప్పుడు ఇదే సామర్థ్యంతో, అడ్వాన్స్డ్ ఫీచర్లు, స్టైలింగ్‌తో మార్కెట్లోకి వచ్చిన స్కూటర్లు సైతం పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో సక్సెస్ అయ్యి, కాలేజీ స్టూడెంట్స్‌కు బెస్ట్ ఆప్షన్‌గా గుర్తింపు తెచ్చుకున్న టాప్-5 125 సీసీ స్కూటర్స్ ఏవో పరిశీలిద్దాం.
Top Five 125cc Scooters : టాప్-5 125 సీసీ స్కూటర్స్ ఇవే.. కాలేజీ స్టూడెంట్స్‌కు బెస్ట్ ఆప్షన్..
– యమహా ఫాసినో.. ఇండియాలో అందుబాటులో ఉన్న అత్యంత తేలికైన స్కూటర్లలో యమహా ఫాసినో 125 ఒకటి. దీని ధర రూ.79,100 నుంచి రూ.92,830 వరకు ఉంటుంది. స్మార్ట్ మోటార్ జెనరేటర్ సిస్టమ్‌తో డెవలప్ చేసిన 125సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో ఈ స్కూటర్ వచ్చింది. సీవీటీ సపోర్ట్ సైతం దీనికి ఉంటుంది. ఇది 8.04 బీహెచ్‌పీ పవర్, 10.3 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
– టీవీఎస్ ఎన్‌టార్క్.. ఈ స్కూటర్ యూత్‌లో ఎక్కువ పాపులర్ అయింది. దీని ధర రూ. 84,536 నుంచి రూ.1.04 లక్షల వరకు ఉంటుంది. దీని స్పోర్టీ లుక్, హై-టెక్ ఫీచర్లకు యూత్ ఇంప్రెస్ అవుతున్నారు. 124.8 సీసీ సింగిల్ సిలిండర్, ఆర్టీ-ఎఫ్‌ఐతో కూడిన ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఇంజిన్‌తో స్కూటర్ రన్ అవుతుంది. ఇది సీవీటీతో వస్తుంది. ఎన్‌టార్స్ స్కూటర్ 9.2 బీహెచ్‌పీ పవర్, 10.5 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
– వెస్పా VXL/SXL.. డీప్ పాకెట్ స్పేస్ ఉన్న ఫ్యాన్సీ స్కూటర్ ఇది. దీని ధర రూ. 1.32 లక్షలు కాగా, ఎస్‌ఎక్స్సెల్ 125 ధర రూ.1.37 లక్షలు. ఇవి 124.45 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ సీవీటీ ఇంజిన్‌తో రన్ అవుతాయి. 9.8 బీహెచ్‌పీ పవర్, 9.6 ఎన్‌ఎం టార్క్ అవుట్‌పుట్‌తో ఇవి బెస్ట్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.
– హోండా డియో 125.. హోండా నుంచి వచ్చిన డియో 125 మార్కెట్లోని బెస్ట్ 125 సీసీ స్కూటర్లలో ఒకటి. దీని ధర రూ.83,400 నుంచి రూ.91,300 వరకు ఉంటుంది. హోండా డియో 125 స్కూటీ 123.97 సీసీ,, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ సీవీటీ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 8.19 బీహెచ్‌పీ పవర్, 10.4 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
సుజుకి యాక్సెస్ 125.. సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ధర రూ.79,400 నుంచి రూ.89,500 వరకు ఉంది. ఇది మంచి మైలేజీతోపాటు స్మూత్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ స్కూటర్ 124 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్, సీవీటీ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 8.5 బీహెచ్‌పీ పవర్, 10 ఎన్‌బీ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.