Homeఎంటర్టైన్మెంట్NTR: బన్నీ రిజెక్ట్ చేసిన సినిమా తారక్​ చేతుల్లోకి!

NTR: బన్నీ రిజెక్ట్ చేసిన సినిమా తారక్​ చేతుల్లోకి!

NTR: ఇటీవల కాలంలో టాలీవుడ్​లో పాన్ ఇండియా సినిమాల జోరు పెరుగుతోంది. ఈ బాటలోనే నడుస్తున్నారు ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్​, యంగ్​  టైగర్​ ఎన్టీఆర్​. ప్రస్తుతం పుష్ప సినిమాతో ఫుల్​ బిజీగా ఉన్నారు బన్ని. మరోవైపు ఆర్​ఆర్​ఆర్​ సినిమా షూటింగ్​లో తారక్​ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఫిల్మ్​ ఇండస్ట్రీలో వీరిద్దరికి సంబంధించి ఓ వార్త వినిపిస్తోంది. బన్నీ రిజెక్ట్​ చేసిన ఓ సినిమాకు ఎన్టీఆర్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు సమాచారం.

tollywood-buz-creating-about-koratala-ntr-movie

యంగ్​టైగర్​ ఎన్టీఆర్​, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్​లో జనతా గ్యారేజ్​ సినిమా బ్లాక్​బాస్టర్​ హిట్​ కొట్టింది. ఇటీవల ఎన్టీఆర్​30 హ్యాజ్​టాగ్​తో ఓ ప్రాజెక్టును ప్రకటించారు. పాన్​ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పట్టాలెక్కనుంది. ఫిబ్రవరి తర్వాత రెగ్యులర్​ షూటింగ్​ను ప్రారంభించేందుకు మేకర్స్​ సన్నాహాలు చేస్తున్నారు. స్టూడెంట్స్​ పాలిటిక్స్​ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్ననట్లు తెలుస్తోంది.

అయితే, ఈ సినిమా కథను కొరటాల శివ తొలుత అల్లు అర్జున్​కి వినిపించగా.. నా పేరు సూర్య సినిమా ఇదే కోవకు చెందడంవల్ల.. ఈ ఆఫర్​ను తిరస్కరించినట్లు సమాచారం. ఆ తర్వాత ఎన్టీఆర్​కు స్క్రిప్ట్ వినిపించగా.. ఆయన గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ యాంగర్ మేనేజ్‌మెంట్‌తో హిట్ కొడతాడా ? అనేది చూడాలి.

కాగా, పుష్ప సినిమాతో వస్తోన్న బన్నీ.. రోజుకో పోస్టుతో సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. మరోవైపు ఆర్​ఆర్​ఆర్​ సినిమాలోనూ వరుస ప్రమోషన్స్​తో బజ్ క్రియేట్​ చేస్తున్నారు. డిసెంబరులో పుష్ప సినిమా విడుదలకు సిద్ధం కాగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆర్​ఆర్​ఆర్​ సినిమా రంగంలోకి దిగనుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular