
Balakrishna: ఇప్పుడున్న తెలుగు సినిమా హీరోల్లో నందమూరి బాలకృష్ణ చాలా విషయాల్లో నిర్మాతలకు మంచి లాభదాయకం. బాలయ్య రెమ్యునరేషన్ ఎక్కువ ఉండదు. బాలయ్య నుంచి డిమాండ్స్ కూడా పరిధికి మించి దాటవు. ఏ రకంగా చూసుకున్న బాలయ్యతో సినిమా అంటే నిర్మాతలకు ఎప్పుడూ సంతోషమే. అయితే, ఇక్కడ ఒక సమస్య ఉంది. బాలయ్యను కరెక్ట్ గా డీల్ చేయాలి. లేదంటే.. అసలుకే మోసం వస్తోంది.
అవును, బాలయ్యతో సినిమా చేసే ప్రతి నిర్మాతకు ఓ భయం ఉంటుంది. బాలయ్యతో డీలింగ్ ఎలా ? ఈ విషయంలోనే కొందరు నిర్మాతలు కాస్త కంగారు పడతారు. మరికొంత మంది అయితే ఎక్కువ భయ పడతారు. ఇక తొలి సారి బాలయ్యను డీల్ చేసే వాళ్ళు అయితే, ఇక లోలోపలే చాలా నలిగిపోతూ ఉంటారు. అందుకే బాలయ్య సినిమా చేస్తున్న వాళ్ళు మాత్రమే మళ్ళీ మళ్ళీ బాలయ్యతో సినిమా చేస్తారు తప్ప, కొత్తవారు బాలయ్య వైపు కూడా వెళ్లరు.
ఇండ్రస్ట్రీలో ఇలాంటి రూమర్లు బాలయ్య(Balakrishna) పై బోలెడు ఉన్నాయి. ముఖ్యంగా బాలయ్య కోపధారి మనిషి అనేది అందరికి తెలిసిన విషయం. దీనికి తోడు బాలయ్య ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి అర్ధం కాదు. ఆ భయంలోనే ఇప్పుడు మైత్రీ యూనిట్ బాగా టెన్షన్ పడుతుంది. ప్రస్తుతం బాలకృష్ణ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ యాక్షన్ సినిమాను ప్లాన్ చేస్తోంది.
గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకుడు. బాలయ్య దగ్గరకు పోయి సీన్ చెప్పడానికి గోపీచంద్ మలినేనే కాస్త భయపడుతున్నాడట. డైరెక్టరే ఆ రేంజ్ లో భయపడుతుంటే.. ఇక యూనిట్ మాటేమిటి ? అందుకే, యూనిట్ లో ఇప్పటికే కొందరు వేరే సినిమాలకు కమిట్ అయ్యారట. మెయిన్ గా మైత్రీకి పనిచేసే రెగ్యులర్ మేనేజర్లు ఇప్పుడు ఈ సినిమాకు పని చేయడం లేదు.
దాంతో బాలయ్యకు పరిచయం ఉండి, బాలయ్య సినిమాలకు పనిచేసిన వాళ్ళ లిస్ట్ ను తెప్పించుకుని వారినే తమ సినిమాకు పెట్టుకోవడానికి ప్రస్తుతం మైత్రీ అధినేతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే విచిత్రంగా బాలయ్యతో పని చేయడానికి చాలామంది క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. కారణం.. బాలయ్య తన దగ్గర పని చేసే వారికీ ఎక్కువ జీతాలు ఇప్పించడంతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సాయం చేస్తూ ఉంటాడట.
Also Read: బాలయ్య టాక్ షోలో సెకండ్ గెస్ట్ గా నేచురల్ స్టార్ నాని..?