రాత్రి డ్యూటీ ఎక్కితే.. 2 గంటల దాకా..: అన‌సూయ

జ‌బ‌ర్ద‌స్త్ షోలో చిట్టిపొట్టి డ్ర‌స్సుల‌తో క‌వ్వించే అన‌సూయ‌.. సోష‌ల్ మీడియాలోనూ హాట్ హాట్ పిక్చ‌ర్స్ షేర్ చేస్తూ భారీగా ఫాలోవ‌ర్లను పెంచుకుంది. ఇక‌, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత‌.. త‌న‌దైన స్టార్ డ‌మ్ తో దూసుకెళ్తోంది. సినిమాల్లో బిజీ అయిన‌ప్ప‌టికీ.. బుల్లి తెర‌ను వ‌దిలేద‌ని చెప్పిన ఈ బ్యూటీ.. రెండు రంగాల్లోనూ స‌త్తా చాటుతోంది. అయితే.. ఇటీవ‌ల ఓ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి బోల్డ్ గా మాట్లాడేసింది. ఏ విష‌యం మీదనైనా.. […]

Written By: Bhaskar, Updated On : April 15, 2021 3:57 pm
Follow us on


జ‌బ‌ర్ద‌స్త్ షోలో చిట్టిపొట్టి డ్ర‌స్సుల‌తో క‌వ్వించే అన‌సూయ‌.. సోష‌ల్ మీడియాలోనూ హాట్ హాట్ పిక్చ‌ర్స్ షేర్ చేస్తూ భారీగా ఫాలోవ‌ర్లను పెంచుకుంది. ఇక‌, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత‌.. త‌న‌దైన స్టార్ డ‌మ్ తో దూసుకెళ్తోంది. సినిమాల్లో బిజీ అయిన‌ప్ప‌టికీ.. బుల్లి తెర‌ను వ‌దిలేద‌ని చెప్పిన ఈ బ్యూటీ.. రెండు రంగాల్లోనూ స‌త్తా చాటుతోంది. అయితే.. ఇటీవ‌ల ఓ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి బోల్డ్ గా మాట్లాడేసింది.

ఏ విష‌యం మీదనైనా.. త‌న అభిప్రాయాన్ని కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టుగా చెప్పేసే అనసూయ‌.. వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన ర‌హ‌స్యాల‌ను కూడా బ‌య‌ట పెట్టింది. ఏ మాత్రం మొహ‌మాట ప‌డ‌కుండా.. అడిగిన ప్ర‌శ్న‌ల‌న్నింటికీ ఆన్స‌ర్ చేసింది. ఇందులో ముఖ్య‌మైంది.. ‘మీరు తాగుతారా?’ అని అడిగిన ప్రశ్నకు ‘అవును’ అంటూ తడుముకోకుండా సమాధానం చెప్పిందీ హాట్ బ్యూటీ.

అంతేకాదు.. రాత్రి 2 గంటల వరకూ అని చెప్పడంతో.. కళ్లు పెద్దవి చేయడం అందరివంతైంది. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అన‌సూయ స్టేట్ మెంట్ పై ఎవ‌రికి న‌చ్చిన విధంగా వారు కామెంట్ చేస్తున్నారు. కొంద‌రు ఇదేం బుద్ధి అంటుంటే.. మ‌రికొంద‌రు అందులో త‌ప్పేముంది అని సపోర్టు చేస్తున్నారు. ఇండ‌స్ట్రీలో ఇది సాధార‌ణ విష‌య‌మ‌ని, చాలా మంది బ‌య‌ట ప‌డ‌ర‌ని అంటున్నారు.

అన‌సూయ మాత్రం ఓపెన్ గా చెప్పింద‌ని అంటున్నారు. అయితే.. తాను తాగుతానని గతంలో కూడా చెప్పింది అన‌సూయ‌. అయితే.. గ్లామ‌ర్ కోస‌మే చిన్న‌డోస్ తీసుకుంటాన‌ని చెప్పింది. ఇప్పుడు ఓపెన్ గా భారీ స్టేట్ మెంట్ ఇవ్వ‌డంతో అంద‌రూ అవాక్క‌వుతున్నారు.