Tollywood Blockbuster Movies: ఒక సినిమా సక్సెస్ కావడానికి ఒకప్పుడు కథ, యాక్షన్ పై దృష్టి పెట్టేవారు. ఇవి బాగుండడంతో మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రేక్షకులు థియేటర్లోకి పరుగులు పెట్టేవారు. ఇప్పుడు సినిమా గురించి ముందే హైప్ క్రియేట్ చేసి ప్రేక్షకులను రప్పిస్తున్నారు. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు థియేటర్లోకి వచ్చాక నిరాశ చెందుతున్నారు. సినిమా స్టోరీ లైన్ బాగా లేకున్నా మొదటి వారం కలెక్షన్లు వస్తే చాలు.. అని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏ సినిమా ఎన్ని వసూళ్లు రాబట్టింది..? అనే దానిపైనే ఎక్కువగా చర్చ సాగుతోంది.

ఒక సినిమా కలెక్షన్లను గ్రాస్, షేర్ అమౌంట్ ను లెక్కలేసుకుంటారు. గ్రాస్ కలెక్షన్లు అంటే సినిమా విడుదలైనప్పటి నుంచి ఓటీటీలో వచ్చిన వసూళ్ల వరకు లెక్కలేస్తారు. షేర్ అంటే గ్రాస్ కలెక్షన్స్ లో కొన్ని ఖర్చులు తీసేసి మిగతాది లెక్కగడుతారు. అంటే ఖర్చులు పోగా పెట్టుబడులు, లాభాలు వేరు చేసి ఎంత వసూలైంది అనేది చూస్తారు. అయితే ఏ సినిమాకైనా షేర్ ఎంత వసూలు చేసిందనేదానిని భట్టి ఆ సినిమా సక్సెస్.. ఫెయిల్.. అనేది డిసైడ్ చేస్తారు. ఒక హీరో క్రెడిట్ కూడా దీనిపై ఆధారపడుతుంది.
2022 సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని సినిమాలు స్టోరీ లైన్ బాగా లేకున్నా అంతకు మించి అన్న కలెక్షన్లు సాధించాయి. అందుకు సినిమా రిలీజ్ కు ముందు చేసిన హడావుడే. ట్రైలర్, ప్రత్యే ఈవెంట్స్ ద్వారా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగారు. మరికొన్ని సినిమాలు మాత్రం కథ బాగుండడంతో మంచి వసూళ్లను రాబట్టాయి. మరి అలాంటి సినిమాలేవో చూద్దాం.
ట్రిపుల్ ఆర్-1135 కోట్ల
రాజమౌళి సినిమాలంటే ప్రేక్షకులకు యమ క్రేజ్. ఆయన సినిమా ఎలా తీస్తారో ప్రేక్షకులు ముందే ఎక్స్పెక్ట్ చేస్తారు. వారికి అనుగుణంగా జక్కన్న సినిమాలపై శ్రద్ధ పెడుతారు. ఈ క్రమంలో మల్టీస్టార్లు అయిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా గ్రాస్ గా రూ.1135 కోట్లు రాబట్టింది. ఇప్పుడు దీనిని జపాన్ లో కూడా రిలీజ్ చేశారు. అక్కడ కూడా రికార్డులు బద్దలు కొడుతోంది.
సర్కారువారి పాట -రూ.178 కోట్లు:
సూపర్ స్టార మహేశ్ బాబు నటించిన వరుస హిట్ల జోరుమీదున్నాడు. మహర్షి నుంచి ఆయన సినిమాలు సక్సెస్ అవుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన నటించిన ‘సర్కారు వారి పాట’ రిలీజై హ్యాట్రిక్ కొట్టాడు. ఈ సినిమా రూ.178 కోట్ల వసూళ్లు రాబట్టింది.
భీమ్లానాయక్ -రూ.161 కోట్లు:
పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లానాయక్ రూ.161 కోట్ల వసూళ్లు రాబట్టింది. ‘వకీల్ సాబ్’ తరువాత పవన్ ఏమాత్రం లేట్ చేయకుండా సినిమాలు తీస్తున్నారు.ఆ మూవీ హిట్టు తరువాత ‘భీమ్లానాయక్’ సక్సెస్ సాధించడం విశేషం.

రాధేశ్యామ్ -రూ.151 కోట్లు:
బాహుబలి తరువాత ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తీస్తున్నారు. ఈ మూవీ తరువాత వచ్చిన ‘సాహో’ నిరాశ పరిచింది. అయితే ఆ తరువాత వచ్చిన ‘రాధేశ్యామ్’ హిట్టు టాక్ తెచ్చుకోకపోయినా మంచి వసూళ్లు చేసింది. ఈ సినిమా గ్రాస్ గా రూ.151 కోట్లు రాబట్టింది.
కెజీఎఫ్ -రూ.135 కోట్లు:
కన్నడ చిత్రం కేజీఎఫ్ పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఈ సినిమా సీక్వెల్ కు కేజీఎఫ్ 2 వచ్చింది. ఈ సినిమా రూ.135 కోట్లు రాబట్టింది.
ఎఫ్3-రూ.129 కోట్టు:
విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ లు కలిసి నటించిన సంచలన సక్సెస్ సాధించింది. ఈ సినిమా కు సీక్వెల్ గా ఎఫ్ 3 వచ్చింది. ఈ సినిమా రూ.129 కోట్లు వసూళ్లు చేసింది.
కార్తీకేయ 2-రూ.120 కోట్లు:
అఖిల్ హీరోగా వచ్చిన కార్తీకేయ సీక్వెల్ కు కార్తీకేయ 2. ఆధ్యాత్మిక నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ గ్రాస్ కలెక్షన్లు రూ.120 కోట్లు.
గాడ్ ఫాదర్ -రూ.106 కోట్లు:
మెగాస్టార్ చిరంజీవి తీసిన రీమేక్ మూవీ గాడ్ ఫాదర్. పొలిటికల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా రూ.106 కోట్ల వసూళ్లు రాబట్టింది.
సీతారామం -రూ. 91 కోట్లు:
లవ్, యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సీతారామం ఓవరాల్ గా రూ.91 కోట్ల వసూళ్లు చేసింది.
ఆచార్య-రూ.74 కోట్లు :
మెగాస్టార్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య కు కొరటాల శివ డైరెక్టర్. ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ రూ.74 కోట్లు.