
వెండితెర పై తమ అందాలతో ప్రేక్షకులకు కనువిందు కలిగించే భామల వెనుక చాల కష్టాలు ఉంటాయి. వారికీ చాల సమస్యలు ఉంటాయి. పైగా వారి అందం వెనుక చాలా బాధలు ఉంటాయి, అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అందం కోసం యోగాలు, ఫిట్నెస్ మంత్రాలు వల్లించే కొంతమంది హీరోయిన్లు కొన్ని వ్యాధులతో బాధ పడుతున్నారు. మరి ఆ హీరోయిన్లు ఎవరు ? వారి అనారోగ్య సమస్యలు ఏమిటో చూద్దాం.
ముందుగా.. స్నేహ ఉల్లాల్.. ఈ హీరోయిన్ సినిమాలు చేసి చాల కాలం అయిపోయింది. మరి ఈమె సినిమాలకు ఎందుకు దూరం అయిందో తెలుసా ? “బ్రెయిన్ ట్యూమర్” వల్ల. స్నేహ ఉల్లాల్ “బ్రెయిన్ ట్యూమర్”తో బాధ పడుతుంది. స్టార్ హీరోయిన్ సమంత.. అదేంటి సామ్ కి ఏం సమస్య అంటే.. సమంత తన నడుము దగ్గర ఒక చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. అందుకే ఈ మధ్య నడుమును ఎక్స్ పోజింగ్ చేయడానికి ఇష్టపడట్లేదు.
లేడీ సూపర్ స్టార్ నయనతార.. స్టార్ హీరోకి ఉన్న ఇమేజ్ ఉన్న నయన్ కూడా ఒక చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. గతంలో ఆమె చేసుకున్న ఓ సర్జరీ కారణంగా ఆమెకు ఈ వ్యాధి వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యాధికి నయనతార ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది. అలాగే మిగిలిన కొంతమంది హీరోయిన్లు కూడా అనారోగ్య సమస్యలతో సతమతవుతున్నారు.
వారిలో హాట్ బ్యూటీ రెజీనాతో పాటు హోమ్లీ హీరోయిన్ లావణ్య త్రిపాటి, అలాగే అచ్చ తెలుగు హాట్ బాంబ్ ప్రియాంక జవాల్కర్ కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఈ అందాల తారలు వెనుక కన్నీళ్లు సమస్యలు ఉండటం బాధాకరమైన విషయం. అసలుకే హీరోయిన్లు అంటే.. చివరకు తమకు ఇష్టమైన ఆహారం కూడా తినలేరు. దానికి తోడు ఈ వ్యాధులు ఒక్కటి. వీరు త్వరగా తమ సమస్యల నుండి బయటపడాలని ఆశిద్దాం.