Rakul Preet Singh: దశాబ్దం పాటు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలింది ‘రకుల్ ప్రీత్ సింగ్’. తెలుగు తమిళంలో చెప్పుకోదగ్గ చిత్రాల్లో నటించిన ఈ నార్త్ బ్యూటీ, అటుపై బాలీవుడ్ కి జంప్ చేసింది. ఐతే, అక్కడ జంప్ సరిగా లాండ్ అవ్వలేదు. ఒక హిట్టు నాలుగు ఫ్లాపులు చందంగా కెరీర్ తిరోగమనంలో వెళ్ళింది. రకుల్ తిరిగి తెలుగు వైపు ప్లేటు పిరాయించింది. ఆ మధ్య `కొండపాలెం’ చిత్రంతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే, బిగ్ ఫ్లాప్ తో రకుల్ ఆశలపై నీళ్లు చల్లింది ఆ సినిమా.

చివరకు, టాలీవుడ్ రీఎంట్రీ ఘనంగా ఉండాలన్న ఆశ అడియాశే అయ్యింది. దీంతో తిరిగి సౌత్ లో ఛాన్సులు కరువవడంతో బాలీవుడ్ కెరీర్ పైనే దృష్టి సారించాల్సిన పరిస్థితి వచ్చింది. మరి, మునుముందు టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కి ఛాన్స్ ఉంటుందా .. లేదా ? అన్నది ఇప్పుడే చెప్పలేం. అయితే సినిమాలు లేకపోయినా.. ఈ బ్యూటీ రకరకాల అసైన్ మెంట్స్ తో నిరంతరం బిజీగా ఉంటుంది.
Also Read: Harish Shankar: పవన్ తో సినిమా ఉందా లేదా.. ఫాన్స్ ని అయోమయం లో పడేసిన హరీష్ శంకర్
ప్రస్తుతం, కొన్ని బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తుంది. వీలున్నప్పుడల్లా రకరకాల ప్లేస్ లకు సంచరిస్తూ ఘాటు ఫోటో షూట్లతో హీటెక్కిస్తోంది. మధ్యలో రకుల్ తన ప్రియుడితో కలిసి సరదాగా టూర్ లు వేస్తోంది. తాజాగా రకుల్ ఒక ఫోటో షూట్ చేసింది. ఆమె కొత్త ఫోటో షూట్ తాజాగా వెబ్ ని వేడెక్కిస్తోంది. వైట్ హాట్ డ్రెస్ లో కనిపించిన రకుల్, తన బోల్డ్ లుక్స్ తో గుండె జిల్లనిపిస్తోంది.

మొత్తానికి అల్ట్రా మోడ్రన్ లుక్ లో రకుల్ ఫెంటాస్టిక్ అంటూ కుర్రకారు మైమరిచిపోతున్నారు. ఆమె గ్లామర్ పనితనం కుర్రకారును ఆ స్థాయిలో వెర్రెత్తిస్తోంది. పైగా రకుల్ తన అందాలను ఎలివేట్ చేయడానికి ఇచ్చిన ఫోజు కూడా అబ్బబ్బో అంటూ తెగ ఇదైపోతున్నారు నెటిజన్లు. మరి రకుల్ సోషల్ మీడియా సంచలనాలకే పరిమితం అవుతుందా ?, లేక.. సినిమాల్లో మళ్లీ ఓ వెలుగు వెలుగుతుందా ? చూడాలి.
Also Read:Koratala Siva-NTR: ఎన్టీఆర్ తో రిస్క్ చెయ్యడానికి భయపడుతున్న కొరటాల శివ
View this post on Instagram
Recommended Videos
[…] Also Read: Rakul Preet Singh: రకుల్ అందాలకు అబ్బబ్బో అంటున్… […]
[…] […]