
Tollywood: ఇదేందయ్యా ఇది.. ఇది నేనెక్కడా చూడాలా.. గత కొంతకాలంగా ‘మా’ ఎన్నికలను ఫాలో అవుతున్న ప్రేక్షకుల ఫీలింగ్ ఇది. ఈ రోజు నటీనటుల ప్రవర్తనను చూస్తుంటే.. వీళ్ళు సినిమాల్లోనే కాదు, బయట కూడా జీవించేస్తన్నారు, ఒకరిని మించి ఒకరు నటించేస్తున్నారు, వీళ్లకు ఆస్కార్ ఇచ్చిన తక్కువే అనిపిస్తోంది. వీళ్ళ పెర్ఫార్మన్స్ ముందు రాజకీయ నాయకులు బెటర్. మొత్తానికి సినిమాల ద్వారానే కాదు, ఎలక్షన్స్ ద్వారా కూడా జనాలను పిచోళ్ళను చేశారు సినిమా వాళ్ళు.
ఇప్పటివరకూ మంచు విష్ణు – ప్రకాష్ రాజ్ బృందాల మధ్య రసవత్తర పోరుతో పాటు మాటల తూటాలు పేలాయి, వ్యక్తిగత దూషణలు చెలరేగాయి. కానీ, తీరా ఎన్నికల రోజు.. ప్రకాష్ రాజ్, నేరుగా మోహన్ బాబు దగ్గరకు వెళ్లి పలకరించడం, ఆయన గారు ప్రకాష్ రాజ్ ను అక్కున చేర్చుకుని కౌగిలించుకోవడం, ఇక నిన్నటి వరకు అడ్డమైన తిట్ల వర్షం కురిపించుకున్న వాళ్ళు కూడా, నవ్వులతో వెల్కమ్ చెప్పుకోవడం.. ఇదంతా చూస్తూ టైం వేస్ట్ చేసుకున్న జనం చివరకు పిచ్చోళ్ళు అవ్వడం చకచకా జరిగిపోయాయి.
అసలు ‘యాక్టింగ్ ఇరగ దిస్తున్నారు.. కదా…. పర్లేదు.. ఆ మాత్రం ఉండాలి.. లేకపోతే.. కిక్కుండదు’ అంటూ నెటిజన్లు కూడా మన నటులు, హీరోల నిజ జీవిత నటన చూసి ముచ్చట పడుతున్నారు. అసలు ఎలాంటి మనుషులు ? అపుడే తిట్టుకుంటారు, మళ్ళీ అంతలోనే కలుస్తారు. మరి ఈ మాత్రం దానికి మీడియాకు ఎందుకు వెళ్ళడం ?
చివరకు కలసి పోయి.. హమ్మయ్య కలిసిపోయాం అంటూ వీళ్ల కలయిక ఏదో ప్రపంచ శాంతికి కారణం అయింది అన్నట్టు ఉంటుంది ఒక్కొక్కరి నటన. ఒక్కటి మాత్రం నిజం. ఈ ‘మా ఎన్నికలు’ ఎన్నికల వాస్తవ రూపాన్ని బయట పెట్టింది. ఎక్కడైనా చివరికి ఫూల్స్ అయ్యేది ఓటు వేసిన వాళ్ళు మాత్రమే అని నిరూపించింది.
అయినా ఈ రోజులో హైలైట్… ప్రకాష్ రాజ్, మోహన్ బాబు ఆత్మీయ ఆలింగనమే. మహాభారతం మొత్తంలో ద్రుతరాష్టుడు ఎంతో ప్రేమగా భీముడిని కౌగిలించుకున్నట్లు.. ఏమి ఆ కౌగిలింత ? ఏమి ఆ ప్రేమ ? ఏమి ఆ ఆప్యాయత ? వీరి కలయికను చూస్తుంటే.. అబ్బా ఎన్ని నాటకాలు ఆడారు ఇన్నాళ్లు ? అని అనిపిస్తోంది.
అసలు నిన్నటి దాకా కొట్టుకున్నారు.. తిట్టుకున్నారు. ఈ రోజు మేమంతా ఒక్కటేనని ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు భుజాలపై చేయి వేసుకున్నారు. కచ్చితంగా చెప్పొచ్చు, రాజకీయ నాయకులంటే మించి పోయిన అపరిచితులు వీళ్లు.
ఇప్పటికే సినిమా అభిమానులు మారాలి. వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు వాళ్ళు ఎంత తిట్టుకున్నా రేపు ఏదో ఒక సందర్భంలో అందరూ కలిసిపోతారు. కానీ మధ్యలో వాళ్ళ వైపు నుంచి కొట్టుకుని చితికిపోయిన అభిమానులే అన్యాయం అయిపోతారు. అందుకే, అభిమానం ఉండాలి, కానీ అతి అభిమానం ఉండకూడదు.