కళ్లు తిరిగే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు?

ఒకప్పటి సినిమా నిర్మాణానికి నేటి సినిమాను తెరకెక్కించే విధానంలో చాలా తేడాలున్నాయి. ఒకప్పుడు పది, యాభైకోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తే అది భారీ బడ్జెట్ సినిమా. చిన్న సినిమాల బడ్జెటే 10కోట్లు దాటిపోతుండగా ఇక పెద్ద సినిమాలైతే మినిమం 100కోట్లు ఉండాల్సిందే. ఇక ప్యాన్ ఇండియా లెవల్ మూవీలైతే ఈ బడ్జెట్ మరికాస్తా పెరగాల్సిందే. సినిమా నిర్మాణంలో ఎక్కువ భాగంగా హీరోహీరోయిన్లు, దర్మకుల రెమ్యూనేషన్ కే పోతుంది. అగ్రభాగం వీరి ఖాతాలోకి వెళుతున్నట్లు సమాచారం. ఒకప్పుడు […]

Written By: NARESH, Updated On : September 3, 2020 6:25 pm

Tollywood film Industry

Follow us on

ఒకప్పటి సినిమా నిర్మాణానికి నేటి సినిమాను తెరకెక్కించే విధానంలో చాలా తేడాలున్నాయి. ఒకప్పుడు పది, యాభైకోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తే అది భారీ బడ్జెట్ సినిమా. చిన్న సినిమాల బడ్జెటే 10కోట్లు దాటిపోతుండగా ఇక పెద్ద సినిమాలైతే మినిమం 100కోట్లు ఉండాల్సిందే. ఇక ప్యాన్ ఇండియా లెవల్ మూవీలైతే ఈ బడ్జెట్ మరికాస్తా పెరగాల్సిందే. సినిమా నిర్మాణంలో ఎక్కువ భాగంగా హీరోహీరోయిన్లు, దర్మకుల రెమ్యూనేషన్ కే పోతుంది. అగ్రభాగం వీరి ఖాతాలోకి వెళుతున్నట్లు సమాచారం.

ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలు వందకోట్లు వసూలు చేయాలంటే చాలా కష్టంగా మారింది. అయితే ఇటీవల కాలంలో చాలా సినిమాలు వంద కోట్ల మార్కును దాటేసి 200, 300 కోట్లను కేవలం వారంరోజుల్లో రాబడుతున్నాయి. దీంతో నిర్మాతలు కూడా భారీ బడ్జెట్లకు ఏమాత్రం వెనుకడం లేదు. ఇక కొందరు హీరోలైతే సినిమాల్లో వాటా తీసుకుంటూ అత్యధిక ఆదాయాన్ని గడిస్తున్నారు. ప్రస్తుత జనరేషన్లోని టాలీవుడ్ హీరోలు ప్యాన్ ఇండియా రేంజ్ కి చేరుకోవడంతో వారి పారితోషకం కూడా అంతేస్థాయిలో ఉంటుంది.

ప్రస్తుత జనరేషన్లో టాలీవుడ్ నుంచి అత్యధిక పారితోషకం అందుకుంటున్న వారిలో డార్లింగ్ ప్రభాస్ ముందున్నట్లు సమాచారం. ‘బాహుబలి’తో వరల్డ్ వైడ్ గా ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత వరుసబెట్టి అన్ని ప్యాన్ ఇండియా మూవీలే చేస్తూ తన రేంజ్ ను పెంచుకుంటూ పోతున్నాడు. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాగ్ అశ్విన్ మూవీతోపాటు ‘ఆదిపురుష్’ మూవీ ఉంది. ఈ రెండు చిత్రాలు కూడా భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్నారు. ఈ రెండు చిత్రాలకు ప్రభాస్ ఏకంగా 100కోట్ల పారితోషికం తీసుకోనున్నారని టాక్ విన్పిస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఇటీవల తన రెమ్యూనరేషన్ డబుల్ చేసాడట. ‘సరిలేరునీకెవ్వరు’తో 200కోట్లు వసూలు చేసిన మహేష్ తన రెమ్యూనరేషన్ 40కోట్ల నుంచి 80కోట్లకు పెంచినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇక పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’కు ఏకంగా రూ.50కోట్లు తీసుకుంటున్నాడట. అదేవిధంగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఇటీవల మంచి హిట్లతో దూసుకెళుతున్నాడు. ‘అలవైకుంఠపురం’ మూవీ తర్వాత వస్తున్న ‘పుష్ప’ మూవీకి రూ.35కోట్లు వసూలు చేస్తున్నాడట.

జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’లో నటించేందుకు రూ.33కోట్లు తీసుకుంటున్నాడట. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘రంగస్థలం’ హిట్టుతో మంచి ఫామ్ లో ఉన్నారు. అయితే ఆ వెంటనే వచ్చిన ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో రాంచరణ్ నటిస్తున్నందుకుగాను రూ.33కోట్లు తీసుకుంటున్నాడనే వార్తలు విన్పిస్తున్నారు. ఏదిఏమైనా టాలీవుడ్ స్టార్లు దిమ్మతిరిగే రెమ్యూనరేషన్లు అందుకుండటం చర్చనీయాంశంగా మారింది.