Homeఎంటర్టైన్మెంట్మార్కెట్ కోసం బాలయ్య కష్టాలు !

మార్కెట్ కోసం బాలయ్య కష్టాలు !


సీనియర్ స్టార్ హీరోల్లో మెగాస్టార్ వంద కోట్లు మార్క్ ను, వెంకటేష్ కూడా డెబ్భై కోట్లు మార్క్ ను దాటాడు. కానీ బాలయ్య, నాగార్జున మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టలేక వెనుకబడిపోయారు. నాగార్జున అంటే.. పర్లేదు. కనీసం ఆయన ఖాతాలో 60 కోట్లు వరకూ కలెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. పాపం బాలయ్య సినిమాలే కలెక్షన్స్ విషయంలో పూర్తిగా డిజాస్టర్ లు అయిపోతున్నాయి. ఆ మాటకొస్తే.. బాలకృష్ణ గత నాలుగు సినిమాలు ఈ మధ్య గట్టిగా పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేని దుస్థితిలోకి వెళ్లిపోయాయంటే.. ఆయన మార్కెట్ ఎంతలా పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే బాలయ్యకు కలెక్షన్స్ అంటే అస్సలు నచ్చదు అట. ఎవరైనా మన సినిమాకి ఇన్ని కలెక్షన్స్ అనిచెప్పటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద ఆయన వెంటనే సీరియస్ అవుతారట. సినిమా డిజాస్టర్ అయి డబ్బులు మొత్తం పోయినా, నిర్మాతలు కూడా బాలయ్యకి ఎప్పుడూ కలెక్షన్స్ మాత్రం చెప్పరట. మొత్తానికి కలెక్షన్స్ విషయంలో బాలయ్య బాగా ఫీల్ అవుతున్నట్లు ఉన్నారు.

Also Read: హీరోయిన్ ఫీల్ ను అర్ధం చేసుకున్న పవన్ కళ్యాణ్ !

నిజానికి బాలయ్యకి ఒకప్పుడు బాక్సాపీస్ బొనాంజా అని ప్రత్యేకమైన పేరు కూడా ఉండేది. దానికి తగ్గట్లుగానే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల టైంలో కలెక్షన్స్ విషయంలో బాలయ్య ఇండస్ట్రీ రికార్డ్స్ ను తిరగరాశాడు. ఆ సమయంలో బాలయ్య బాబు సినిమాకి పోటీగా మెగాస్టార్ కూడా తన సినిమాను రిలీజ్ చేయడానికి ఆలోచించేవారంటే.. అర్ధం చేసుకోవచ్చు ఒకప్పుడు బాలయ్య బాబు బాక్సాపీస్ స్టామినా. కానీ, ఏమైంది చివరకు.. బాలయ్యకు మిడియమ్ రేంజ్ హీరో మార్కెట్ కూడా లేకుండా పోయింది. అందుకే బాలయ్య ఈసారి తన సినిమా కలెక్షన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారట. ప్రస్తుతం బోయపాటితో చేస్తోన్న సినిమాతో తానూ వంద కోట్ల క్లబ్ లో చేరాలనేది బాలయ్య ప్రస్తుత టార్గెట్.

Also Read: వయసు ముదిరినా తరగని అందం..

అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటే వంద కోట్లు కలెక్ట్ చేయడం ఈజీ అని.. విజయ దేవరకొండ లాంటి చిన్న హీరోనే అది సాధించాడని.. ఇక బాలయ్య లాంటి హీరోకి యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునే సినిమా పడితే.. ఖచ్చితంగా బాక్సాపీస్ వద్ద బాలయ్య రెచ్చిపోవడం ఖాయం అని మేకర్స్ కూడా ఫీల్ అవుతున్నారట. అందుకే బోయపాటి ప్రస్తుతం బాలయ్యతో చేస్తోన్న సినిమా స్క్రిప్ట్ లో.. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యూత్ కి నచ్చే మంచి కామెడీ ట్రాక్ ను యాడ్ చేశాడట. ఏమైనా వంద కోట్లు మార్కెట్ కోసం బాలయ్య ఈ లాక్ డౌన్ లో బోయపాటి చేత బాగానే స్క్రిప్ట్ పనులు చేయించి మరీ.. తానూ కూడా బాడీ తగ్గించడానికి తెగ కష్టపడుతున్నాడట. మరి బాలయ్య కష్టం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version