Vijay Rangaraju Passed Away: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ముందుగా ఇక్కడ అవకాశం రావడమే చాలా గొప్ప విషయం…అలాంటిది అవకాశం అందుకొని సక్సెస్ ని సాధించి స్టార్లుగా వెలుగొందాలి అంటే మాత్రం విపరీతంగా కష్టపడటం తో పాటు కొంచెం అదృష్టం కూడా ఉండాలి…ఇక కొంతమంది నటులకి మంచి టాలెంట్ ఉన్న కూడా వాళ్ళకి సరైన గుర్తింపైతే రావడం లేదు…ఇక ఏది ఏమైనా కూడా దర్శక నిర్మాతలు మంచి నటులను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు. కారణం ఏదైనా కూడా వారిని స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది విలెక్షన నటులుగా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. కొంతమంది విలన్ పాత్రలకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంటారు. నిజానికి విజయ రంగరాజు (విజయ రంగరాజు) అనే నటుడు కూడా విలన్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు. ముఖ్యంగా బాలయ్య బాబు చేసిన ‘భైరవ ధ్వీపం’ (Bhairava Dhvipam) సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన చాలా సినిమాలు చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా చిరంజీవి లాంటి స్టార్ హీరో సైతం అతనిని ఎంకరేజ్ చేస్తూ వచ్చారని ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన తెలియజేశారు…ఇక ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం ఒక షూటింగ్ లో గాయపడ్డ ఆయన చెన్నై లోని ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఆయన ఈరోజు గుండెపోటుతో మృతి చెందడం అనేది సినిమా ఇండస్ట్రీని తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తుందనే చెప్పాలి. ఇక ఆయన ఎంటైర్ కెరీర్ లో యజ్ఞం(Yagnam), డమరుకం(Damarukam), శ్లోకం (Shlokam), సీమశాస్త్రి (Seema Sastri) లాంటి సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు.
ఇక ఇప్పుడిప్పుడే విలన్ గా పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాను అంటూ ఆయన. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అయినప్పటికీ అంతలోకే ఆయన ఇలాంటి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం అనేది చాలామంది బాధను కలిగిస్తుందనే చెప్పాలి.
ఇక రీసెంట్ గా మంచి నటులు అనుకునే వాళ్లందరూ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతూ ఉండడం సినిమా ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బగా మారుతుంది. యజ్ఞం సినిమాలో మెయిన్ విలన్ గా నటించిన ఈయన ఆ తర్వాత సినిమాలో కొన్ని నటించిన కూడా ఆయనకు రావలసిన గుర్తింపు అయితే రాలేదు.
మరి ఇప్పుడు ఆయనకి మంచి అవకాశాలు వస్తున్నాయి అనుకున్న సందర్భంలో ఆయనకి గుండెపోటు రావడం మృతి చెందటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇక ఆయన మృతి పట్ల తెలుగు, తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు సైతం సంతాపాన్ని తెలియజేస్తున్నారు…