Sankranti Amanam : ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాలలో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం విడుదలై ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం ఆరు రోజుల్లోనే 100 రూపాయిల షేర్ మార్కుని అందుకొని సంచలనం సృష్టించిన ఈ సినిమా, రాబోయే రోజుల్లో ఇటీవల విడుదలైన ఎన్నో సూపర్ హిట్ పాన్ ఇండియన్ చిత్రాల క్లోజింగ్ వసూళ్లను కూడా అధిగమించబోతుంది. రెండు దశాబ్దాలుగా సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న విక్టరీ వెంకటేష్ కి ఈ సినిమా మరోసారి ఆయన సత్తా ఎలాంటిదో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి రుచి చూపింది. అయితే పండగ సెలవులు ముగిసిన తర్వాత ఈ సినిమా వసూళ్లు నేడు కొన్ని ప్రాంతాల్లో కాస్త తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా నైజాం ప్రాంతం గురించి మనం మాట్లాడుకోవాలి. మొదటి ఆరు రోజులు ఈ చిత్రానికి ఈ ప్రాంతంలో 3 కోట్ల రూపాయిల షేర్ కి తగ్గకుండా వసూళ్లు వచ్చాయి.
నిన్న అయితే ఏకంగా 4 కోట్ల 30 లక్షలకు పైగా షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఇది సాధారణమైన విషయం కాదు. కానీ నేడు హైదరాబాద్ లో వసూళ్లు అమాంతం పడిపోయాయి. ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ బాగుండే అవకాశాలు ఉన్నాయి కానీ, నూన్ మరియు మ్యాట్నీ షోస్ కి కనీస స్థాయి ఆక్యుపెన్సీ కూడా దక్కలేదు. దీంతో ఈ చిత్రానికి కేవలం నేడు కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. మొదటి ఆరు రోజులు ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను చూసి నైజాం ప్రాంతం లో కచ్చితంగా 40 కోట్ల మార్కుని దాటుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు 40 కోట్ల రూపాయిల లోపే క్లోజింగ్ పడే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా నేడు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 5 నుండి 6 కోట్ల రూపాయిల లోపు షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.
మొదటి ఆరు రోజులు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి డబుల్ డిజిట్ షేర్స్ ని రాబడుతూ వచ్చిన ఈ సినిమా, మొట్టమొదటిసారి సింగల్ డిజిట్ షేర్ ని సొంతం చేసుకుంది. 26 వరకు ఇంతే ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 26వ తేదీ పబ్లిక్ హాలిడే కావడం తో మరోసారి ఈ చిత్రం పవర్ ప్లే మోడ్ ని మొదలెట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తే క్లోజింగ్ లో 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకున్న ఏకైక హీరో విక్టరీ వెంకటేష్ మాత్రమే. బాలకృష్ణ ముందుగా ఈ లిస్ట్ లోకి వస్తారని అనుకున్నారు, కానీ అనూహ్యంగా విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇచ్చాడు.