https://oktelugu.com/

Tollywood 2021: 2021 లో భారీ అంచనాలతో వచ్చి అట్టర్ ప్లాప్ అయిన సినిమాలు ఇవే ..!

Tollywood 2021: కరోనా మహమ్మారి విసిరిన పంజాకి తెలుగు బాక్సాఫీస్ వణికిపోయింది, అయితే, మరికొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ ను భయపెట్టాయి. కనీస కలెక్షన్స్ ను కూడా రాబట్టలేక, పెద్ద డిజాస్టర్లుగా నిలిచి తెలుగు సినిమా పరువు తీసిన సినిమాలు కూడా ఎప్పటిలాగే ఈ ఏడాది కొన్ని ఉన్నాయి. మరి ఆ సినిమాలేమిటో ఒక లుక్కేద్దాం. అల్లుడు అదుర్స్ : అల్లుడు అదుర్స్ కాదు, బెదుర్స్ అనిపించాడు. బెల్లంకొండ శ్రీనివాస్ బాబు అంత గొప్ప డిజాస్టర్ అందించాడు. […]

Written By:
  • Shiva
  • , Updated On : December 27, 2021 5:26 pm
    Follow us on

    Tollywood 2021: కరోనా మహమ్మారి విసిరిన పంజాకి తెలుగు బాక్సాఫీస్ వణికిపోయింది, అయితే, మరికొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ ను భయపెట్టాయి. కనీస కలెక్షన్స్ ను కూడా రాబట్టలేక, పెద్ద డిజాస్టర్లుగా నిలిచి తెలుగు సినిమా పరువు తీసిన సినిమాలు కూడా ఎప్పటిలాగే ఈ ఏడాది కొన్ని ఉన్నాయి. మరి ఆ సినిమాలేమిటో ఒక లుక్కేద్దాం.

    2021-flop-telugu-movies

    Tollywood Movies 2021

    అల్లుడు అదుర్స్ :

    అల్లుడు అదుర్స్ కాదు, బెదుర్స్ అనిపించాడు. బెల్లంకొండ శ్రీనివాస్ బాబు అంత గొప్ప డిజాస్టర్ అందించాడు. కనీస కలెక్షన్స్ కూడా ఈ సినిమాకి రాలేదు. ఈ సినిమాను సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించాడు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఈ ఏడాది మొత్తంలోనే నెంబర్ వన్ డిజాస్టర్‌గా నిలిచింది.

    బంగారు బుల్లోడు :

    కామెడీ హీరో అల్లరి నరేష్ చాలా రోజుల తర్వాత చేసిన ఈ కామెడీ మూవీ నిజంగానే కామెడీ అయిపోయింది. కొత్త దర్శకుడు పివి గిరి తెరకెక్కించిన ఈ బంగారు బుల్లోడు సినిమాకు పోస్టర్స్ డబ్బులు కూడా రాలేదు. దాంతో కనీస కలెక్షన్స్ కూడా రాబట్టలేని ఈ సినిమా ఈ ఏడాది డిజాస్టర్స్ లిస్ట్ లో ప్రముఖంగా చేరింది.

    Also Read: సీతాఫలం తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్?

    చెక్ :

    చెక్ అంటూ తెలివి తేటలను చూపించాలనుకున్న నితిన్ కి ప్రేక్షకులు చెక్ పెట్టారు. చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చింది. కానీ, దారుణంగా నిరాశ పరిచింది. చివరకు డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.

    కపటధారి:

    సుమంత్ హీరోగా ప్రదీప్ కృష్ణమూర్తి తెరకెక్కించిన ఈ కపటధారి సినిమా కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేదు. దాంతో ఈ సినిమా ఈ ఏడాది డిజాస్టర్స్ లిస్ట్ లో ప్రముఖంగా చేరింది.

    వైల్డ్ డాగ్ :

    అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన ఈ సినిమా దారుణంగా ప్లాప్ అయింది. కొత్త దర్శకుడు అసిషోర్ సోలోమన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి అసలు ఓపెనింగ్స్ కూడా రాలేదు. టాక్ బాగానే వచ్చినా కలెక్షన్స్ పరంగా డిజాస్టర్స్ లిస్ట్ లో చేరింది.

    శశి:

    ఆది సాయి కుమార్‌ కు 2021నే కాదు, ఏ సంవత్సరం కరెక్ట్ గా కలిసిరాలేదు. ఆనవాయితీ ప్రకారమే ఈ ఏడాది కూడా శశి సినిమాతో అది మరో డిజాస్టర్ అందుకున్నాడు.

    లక్ష్య:

    నాగశౌర్య హీరోగా వచ్చిన లక్ష్య భారీ డిజాస్టర్ అయిపోయింది. స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం కోసం 8 ప్యాక్ కూడా చేసాడు శౌర్య. కానీ ఉపయోగం లేకుండా పోయింది. కథ కంటే ఫిజిక్‌పై ఫోకస్ పెట్టినట్టు ఉన్నాడు. అందుకే, సినిమాలో మ్యాటర్ లేకుండా పోయింది. మొత్తమ్మీద డిజాస్టర్ల లిస్ట్ లో ఈ సినిమా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది.

    Also Read: ఖాళీ కడుపుతో పొద్దున్నే ఈ ఆహార పదార్దాలను తింటున్నారా… అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే ?

    గాలి సంపత్:

    శ్రీవిష్ణు, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన గాలి సంపత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పోస్టర్స్ కు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది. బాగా నిరాశ పరిచింది.

    చావు కబురు చల్లగా :

    కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నుంచి వచ్చిన ఈ చావు కబురు చల్లగా డిజాస్టర్ అయింది. డిజాస్టర్ అయింది అనేకంటే.. అంతకంటే ఎక్కువే అని అనుకోవాలి. ఈ సినిమా ఫుల్ రన్‌లో ఏ షోలోనూ ప్రభావం చూపలేకపోయింది.

    Tags