Toli Prema Sensational Comments : కొత్త తరహా సినిమాలను చేయడం లో ఎప్పుడూ ముందుండే హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఇతని పేరు రీసౌండ్ వచ్చేలా వినపడింది. అయితే ఇతనివి ఒక సినిమా సూపర్ హిట్ అయితే, వరుసగా రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఉదాహరణకు ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రం సూపర్ హిట్ అయ్యాక ‘మీటర్’, ‘రూల్స్ రంజన్’ వంటి డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకున్నాడు. దీంతో స్క్రిప్ట్ సెలక్షన్ లో చిన్నగా అప్డేట్ అయ్యి ‘క’ అనే చిత్రం లో నటించాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా, కొత్త రకమైన ప్రయత్నం చేసినందుకు కిరణ్ అబ్బవరం పై ప్రశంసల వర్షం కూడా కురిసింది. కానీ ఈ సినిమా తర్వాత వచ్చిన ‘దిల్ రూబా’ చిత్రం మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.
ఇలా తన కెరీర్ ని నడిపిస్తూ ఉన్నాడు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు అతని తదుపరి చిత్రం ఏమిటి?, ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు అనే చర్చలు సోషల్ మీడియా లో జరుగుతున్న సమయం లో నిన్న ఈ హీరో నుండి ‘చెన్నై లవ్ స్టోరీ'(Chennai Love Story) అనే చిత్రం ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్ వీడియో తో ప్రకటించబడింది. ఈ చిత్రం లో హీరోయిన్ గా గౌరీ ప్రియా నటిస్తుండగా, బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్(Sai Rajesh) దర్శకత్వం వహిస్తున్నాడు. అదే విధంగా బేబీ చిత్రాన్ని నిర్మించి భారీ లాభాలను అందుకున్న SKN ఈ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. సాయి రాజేష్ కథలు కాస్త భిన్నంగానే ఉంటాయి. అదే విధంగా హృదయానికి హత్తుకునే విధంగా కూడా ఉంటాయి. బేబీ చిత్రాన్ని చూసి కనెక్ట్ అవ్వని యూత్ ఎవ్వరూ లేరంటే అతిసయోక్తి కాదేమో. నిజ జీవితాల్లో జరిగే అంశాలనే తన కథామసలుగా తీసుకోవడం ఇతని స్టైల్.
ఈ వీడియో లో ముందుగా హీరోయిన్ ‘బేబీ’ సినిమా ప్రస్తావన తీసుకొస్తుంది. ఆమె మాట్లాడుతూ ‘బేబీ సినిమా చూసావా..? మొదటి ప్రేమకు మరణం లేదు, అది మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడుతుంది. మొదటి ప్రేమ గురించి చాలా బాగా రాసుకున్నాడు కదా. మొదటి ప్రేమ..అది ఒకసారి ఫెయిల్ అయితే నరకం. మొదటి ప్రేమలో ఒక స్వచ్ఛమైన అనుభూతి ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది’ అని అంటుంది. అప్పుడు కిరణ్ అబ్బవరం దానికి సమాధానం ఇస్తూ ‘మొదటి ప్రేమ ఒక్కటే నిజమైతే అందరి కథలు తల్లి ప్రేమ దగ్గరే ఆగిపోవాలి కదండీ. అమ్మే కదండీ మన అందరి ఫస్ట్ లవ్. చరిత్ర లో ఎన్నో గొప్ప ప్రేమ కథలు ఉన్నాయి. వాళ్లందరికీ అవి మొదటి ప్రేమలే కాదు కదా, మొదటి ప్రేమ విఫలం అయ్యిందంటే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలు అవుతుందని. ఒకే చోట కదలకుండా కూర్చుంటే కాసేపటికి కాళ్ళు కూడా తిమ్మిరి ఎక్కుద్ది, మనసు కూడా అంతేనండీ. ఒక్కసారి కదిపి చూడండి మెల్లగా అడుగులు వేస్తూ అదే పరిగెడుతుంది. అంతే కానీ వాడెవడో తొలిప్రేమ, నా సమాధి, బొచ్చు బోషాణం అంటే దానిని పట్టుకొని కూర్చుంటరేంటండి. అలా అయితే నేను కూడా చాలా చెప్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.