https://oktelugu.com/

Tollywood Updates (29.08.2021): నేటి ఎక్స్ క్లూజివ్ సినిమా కబుర్లు !

నేటి టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కి వస్తే.. ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో వస్తున్న ‘ఆచార్య’ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఇతర కీలక పాత్రల దారులు డబ్బింగ్ చెబుతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వినాయక చవితికి స్పెషల్ గా ‘ఆచార్య’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. […]

Written By:
  • admin
  • , Updated On : August 29, 2021 / 11:45 AM IST
    Follow us on

    నేటి టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కి వస్తే.. ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో వస్తున్న ‘ఆచార్య’ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఇతర కీలక పాత్రల దారులు డబ్బింగ్ చెబుతున్నారు.

    ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వినాయక చవితికి స్పెషల్ గా ‘ఆచార్య’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.

    ఇక హీరోయిన్ మెహ్రీన్ మళ్ళీ బిజీ కావడానికి తన రెమ్యునరేషన్ ను బాగా తగ్గించుకుంది. గతంలో మెహ్రీన్ కోటి రూపాయలు తీసుకునేది. కానీ ప్రస్తుతం ఆమె 50 లక్షలకు కూడా సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉంది. అలాగే వివిధ భాషలలో కూడా సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కన్నడ భాషలో శివరాజ్ కుమార్ హీరోగా రానున్న ఓ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది.

    లేడీ సూపర్ స్టార్ నయనతార మరో తమిళ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళంలో అజిత్ హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించడానికి అంగీకరించింది. అన్నట్టు దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రేన్ డైరెక్షన్ లో పృథ్వీరాజ్ హీరోగా రానున్న సినిమాలో కూడా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

    నట సింహం బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న సినిమా షూటింగ్ కి డేట్ ఫిక్స్ అయింది. వచ్చే నెల 22వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు. ఈ షూట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ ప్రత్యేక సెట్ కూడా వేయడం స్టార్ట్ చేశారు.