https://oktelugu.com/

Viral Cinema: వైరల్ అవుతున్న టుడే మూవీ డేట్స్ !

Viral Cinema: సినిమా వైరల్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ గంగూబాయి కతియావాడి. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారు. ఇందుకోసం మేకర్స్‌తో భారీ డీల్‌ కుదుర్చుకున్నట్లు సమాచారం. మార్చి 25 నుంచి ఈ సినిమా OTTలో స్ట్రీమింగ్‌ కానుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 14, 2022 / 04:51 PM IST
    Follow us on

    Viral Cinema: సినిమా వైరల్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ గంగూబాయి కతియావాడి. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారు. ఇందుకోసం మేకర్స్‌తో భారీ డీల్‌ కుదుర్చుకున్నట్లు సమాచారం. మార్చి 25 నుంచి ఈ సినిమా OTTలో స్ట్రీమింగ్‌ కానుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ అజయ్ దేవ‌గ‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టించిన సంగతి తెలిసిందే.

    Gangu Bai

    మరో అప్ డేట్ విషయానికి వస్తే.. భారత మహిళల కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితకథ ఆధారంగా కొత్త చిత్రం తెరకెక్కబోతుంది. ‘శభాష్ మిథు’ పేరుతో వస్తున్న ఈ చిత్రంలో తాప్సీ పన్ను మిథాలీ రాజ్గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి అయింది అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకు శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. వయాకామ్18 స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది.

    Shabaash Mithu

    ఇక మరో అప్ డేట్ ఏమిటంటే..కమల్‌హాసన్‌ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది విక్రమ్‌ చిత్రం.ఇందులో కమల్‌తో పాటు మలయాళ స్టార్‌ ఫహద్ ఫాసిల్, తమిళ స్టార్‌ విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్‌ 3న విడుదల చేస్తున్నట్టు ఓ మేకింగ్‌ వీడియో ద్వారా తెలిపారు. ఒక్క మేకింగ్‌ వీడియోతోనే అంచనాలు పెంచేశారని చెప్పాలి. కమల్‌ లైవ్‌ యాక్షన్‌, అనిరుధ్‌ నేపథ్య సంగీతం సూపర్‌ అనేలా ఉంది. దీనికి లోకేష్ కనగరాజ్ దర్శకుడు.

    Vikram

    ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పొన్నియన్‌ సెల్వన్‌-1 సినిమా సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ఐశ్వర్యరాయ్‌, త్రిష, విక్రమ్‌, జయం రవి, కార్తి ఫస్ట్‌ లుక్స్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి.

    Ponniyin Selvan

    Tags