https://oktelugu.com/

Etthara Jenda Song Postponed: ‘ఎత్తర జెండా’ మధ్యలోనే ఆగిపోతే ఎలా రాజమౌళి ?

Etthara Jenda Song Postponed: నేషనల్ రేంజ్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా ఈ సినిమా ఇప్పటికే “ఎత్తర జెండా” అనే సెలబ్రేషన్‌ యాంథమ్‌ ప్రోమో విడుదలై బాగా హిట్ అయ్యింది. ‘నెత్తురు మరిగితే ఎత్తెర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా’ అంటూ సాగే ఈ ఫుల్ పాటను ఈ రోజు సాయంత్రం విడుదల చేయాలని చిత్రబృందం మొదట […]

Written By:
  • Shiva
  • , Updated On : March 14, 2022 / 05:00 PM IST
    Follow us on

    Etthara Jenda Song Postponed: నేషనల్ రేంజ్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా ఈ సినిమా ఇప్పటికే “ఎత్తర జెండా” అనే సెలబ్రేషన్‌ యాంథమ్‌ ప్రోమో విడుదలై బాగా హిట్ అయ్యింది. ‘నెత్తురు మరిగితే ఎత్తెర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా’ అంటూ సాగే ఈ ఫుల్ పాటను ఈ రోజు సాయంత్రం విడుదల చేయాలని చిత్రబృందం మొదట ప్లాన్ చేసింది.

    Etthara Jenda Song Postponed

    అయితే, ఈ సాంగ్ రిలీజ్ పోస్ట్ ఫోన్ అయ్యింది అంటూ తాజాగా చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్టర్‌ లో క్లారిటీ ఇచ్చింది. సాంకేతిక లోపం కారణంగా, ఈ గీతం రేపు ఉదయం 10 గంటలకు విడుదల కానుంది అని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం అధికారికంగా తెలియజేసింది. దాంతో ఫ్యాన్స్ ‘ఏమిటి రాజమౌళి ఇది’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్.. అంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నేషనల్ రేంజ్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

    పైగా నిజమైన మల్టీస్టారర్ కాబట్టి ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏ రకంగా చూసుకున్నా.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయం అంటున్నారు మేకర్స్.

    Also Read: వైరల్ అవుతున్న టుడే మూవీ డేట్స్ !

    అన్నిటికీ మించి ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇప్పటికే ఈ సినిమా నుంచి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ టీజర్, కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్, మరియు ట్రైలర్ అండ్ సాంగ్స్ విడుదలైయి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి.

    అన్నట్టు ఈ సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే.. కొన్ని వేలమంది ప్రాణాలను కాపాడటానికి ఎన్టీఆర్ పాత్ర కావాలని ప్రాణ త్యాగం చేస్తోందని.. ఈ సీక్వెన్స్ వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ప్రీమియర్స్‌తో ఆర్ఆర్ఆర్ ఒకరోజు ముందుగా, అంటే మార్చి 24నే పలకరించనుంది. ఇప్పటికే ఏ చిత్రానికి లేనంత క్రేజీగా ప్రీమియర్‌ టికెట్లు అమ్ముడుపోతున్నాయి.

    Also Read: స్టేజిమీదే వ‌ర్ష‌, ఇమ్మాన్యూయెల్ మ‌ధ్య గొడ‌వ‌.. ఏడ్చుకుంటూ వెళ్లిపోయిన న‌టి..

    Tags