Speaker Suspends TDP MLA’s: ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం ప్రారంభమైన సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టారు. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టగా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో టీడీపీ నేతలు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. వారిని కట్టడి చేసే క్రమంలో వారిపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో వారు వినిపించుకోలేదు. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవులు, రామానాయుడు, వీరాంజనేయస్వామి అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు.
స్పీకర్ పోడియంను చుట్టుముడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో మార్షల్ తో వారిని బయటకు పంపించారు. దీనిపై టీడీపీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించినందుకే బయటకు పంపిస్తారా? అని దుయ్యబడుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో ప్రతిపక్షం గొంతు నొక్క పని చేస్తుందని వాపోతున్నారు. జంగారెడ్డి గూడెం ఘటనపై మంత్రి ఆళ్ల నాని వివరణ ఇచ్చారు. టీడీపీ సభ్యులు చేస్తున్న ఆందోళనలో న్యాయం లేదని చెబుతున్నారు.
Also Read: Janasena Pawan: ‘జనసేనాని’ గేర్ మార్చాల్సిందేనా?
టీడీపీ సభ్యులపై వేసిన సస్పెన్షన్ వేటుపై అధినేత చంద్రబాబు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు చేపడుతున్న నినాదాలతో సభ హోరెత్తింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేయడం ఆందోళనకు గురి చేసింది.
మరోవైపు సభలో ఎదురు లేకుండా చేసకోవడానికే వైసీపీ ప్రాధాన్యం ఇస్తోంది. ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఒంటికాలుతో లేవడం అలవాటుగా మారింది. దీంతోనే సభలో అడ్డు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలను బహిష్కరణకు గురి చేసి తాము అనుకున్నది సాధించాలని భావిస్తోంది. కానీ టీడీపీ సభ్యులు మాత్రం ప్రభుత్వ చర్యలను నిలదీస్తూ ప్రజల పక్షాన నిలిచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.