https://oktelugu.com/

Prabhas: 100 కోట్లుతో పాటు 10 శాతం లాభాలు తీసుకుంటున్న ప్రభాస్ !

Prabhas: నేషనల్ స్టార్ గా ప్రభాస్‌ రేంజ్‌ ప్యాన్‌ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. అందుకే నిర్మాతలు, రాధేశ్యామ్‌ వంటి రోమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ కి కూడా దాదాపు రూ. 350 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ క్రమంలో ప్రభాస్‌ నటించే యాక్షన్‌ బ్లాస్టర్‌ సలార్‌ పై ఓ ఆసక్తికర విషయం చర్చలో ఉంది. ఈ చిత్రానికి ప్రభాస్‌ రూ. 100 కోట్లతో పాటు చిత్ర వసూళ్లలో 10 శాతం తీసుకుంటున్నాడట. ప్రశాంత్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 27, 2022 / 11:02 AM IST
    Follow us on

    Prabhas: నేషనల్ స్టార్ గా ప్రభాస్‌ రేంజ్‌ ప్యాన్‌ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. అందుకే నిర్మాతలు, రాధేశ్యామ్‌ వంటి రోమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ కి కూడా దాదాపు రూ. 350 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ క్రమంలో ప్రభాస్‌ నటించే యాక్షన్‌ బ్లాస్టర్‌ సలార్‌ పై ఓ ఆసక్తికర విషయం చర్చలో ఉంది. ఈ చిత్రానికి ప్రభాస్‌ రూ. 100 కోట్లతో పాటు చిత్ర వసూళ్లలో 10 శాతం తీసుకుంటున్నాడట. ప్రశాంత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడమే ఇందుకు కారణమంటున్నారు.

    Prabhas

    అంటే మొత్తానికి ప్రభాస్‌ రూ. 100 కోట్లు ప్లస్ 10 శాతం లాభాలు తీసుకుంటున్నాడు అన్నమాట. ఇక ‘రాధేశ్యామ్’ విడుదలకు ఎప్పుడో సిద్ధమైంది. అన్నట్టు ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ప్రభాస్, పూజా హెగ్డే లేకుండానే వారిద్దరి మధ్య చిత్ర యూనిట్ ఓ రొమాంటిక్ సాంగ్ తీశారు. కారణం.. ఈ సాంగ్ షూటింగ్ టైమ్‌కు పూజ ఇతర సినిమాలతో బిజీ అయి డేట్లు అడ్జస్ట్ చేయలేకపోయింది. దీంతో గ్రాఫిక్స్ ద్వారా ఈ సాంగ్ పూర్తి చేశారట.

    Also Read: మనుషులను నాశనం చేసే ఐదు ప్రమాదకరమైన అలవాట్ల గురించి మీకు తెలుసా?

    అయితే, ప్రభాస్-పూజా లేకుండానే వారి మధ్య రొమాంటిక్ సాంగ్ ఎలా తీశారు అంటే.. పెరిగిన టెక్నాలజీని వాడుకుంటూ అద్భుతాలు చేయవచ్చు అని ఈ సినిమా టీమ్ చెబుతుంది. ఈ ‘రాధేశ్యామ్’ విషయంలో యువీ క్రియేషన్స్ తెలివిగా ముందుకు వెళ్తుంది. ప్రమోషన్స్ దగ్గర నుంచీ ట్రైలర్ వరకూ ప్రతి దాని విషయంలో పర్ఫెక్ట్ గా ముందుకు వెళ్తుంది. పైగా సినిమా గురించి ఇలా ఇంట్రెస్టింగ్ ఫీడ్ బ్యాక్ లను జనంలోకి వదులుతున్నారు.

    Prabhas

    మొత్తానికి హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని.. మెయిన్ గా కళ్ళు చెదిరే యాక్షన్స్ తో అబ్బుర పరిచే విజువల్స్ తో ప్రభాస్ ఆకట్టుకుంటాడట. అయితే ‘రాధే శ్యామ్’ సినిమా పై జనం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. పైగా రాధాకృష్ణ కుమార్ అనే కొత్త దర్శకుడు తీసిన సినిమా ఇది. అందుకే అందరికీ ఈ సినిమా పై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి స్థితిలో మంచి పిక్ రావడం సినిమాకి ప్లస్ అవుతుంది.

    Also Read: ఒమిక్రాన్ సోకిన వాళ్లకు శుభవార్త.. ఆ వేరియంట్లు సోకే అవకాశమే లేదట!

    Tags