Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. తనను లైంగికంగా వేధించాడంటూ.. 2020లో గణేష్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ అనంతరం తాజాగా గణేష్‌పై అంథేరీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు. గణేష్‌తో పాటు అతని సహయకుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. హాలీవుడ్ యాక్షన్ హీరో, లెజెండరీ నటుడు బ్రూస్ విల్స్ నటనకు గుడ్ బై చెప్పేశాడు. అతడికి ఇటీవల జరిగిన వైద్య పరీక్షల్లో మెదడు సంబంధిత వ్యాధి అఫేసియా ఉన్నట్లు తేలడంతో బ్రూస్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ వ్యాధి బారిన పడ్డ రోగులు చదవడం, స్పష్టంగా పలకడం కూడా చేయలేరు. దీంతో తన నట జీవితానికి ఇక రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నట్లు అతడి మాజీ భార్య, ప్రముఖ నటి డెమీ మూర్ ఇన్స్టా ఖాతాలో పోస్ట్ పెట్టింది.

Also Read: Junior NTR Politics: మరో పదేళ్లు.. చంద్రబాబు వయసు అయిపోయాకే రాజకీయాల్లోకి ఎన్టీఆర్?
ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. బాలీవుడ్ హీరో, కండల వీరుడు జాన్ అబ్రహం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన తాజా చిత్రం ఎటాక్ APL-1వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఓ విలేకరి అడిగిన ‘సలార్లో మీరు సపోర్టింగ్ రోల్ చేస్తున్నారా’ అన్న ప్రశ్నకు జాన్ ముక్కుసూటిగా సమాధానం ఇచ్చాడు. ‘ఇతర నటుల్లాగా నేను కూడా తెలుగో లేదా వేరే ఏదైనా భాషలో సైడ్ హీరోగా చేయాలన్న ఆలోచన లేదు. నేను హిందీ హీరోని ఇక్కడే కొనసాగుతా’ అని చెప్పేశాడు.

మరో అప్ డేట్ విషయానికి వస్తే.. సినీ దర్శకుడు RGV సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ ను త్వరలోనే తీస్తానని ఆయన ప్రకటించారు. ఏపీ టికెట్ల విషయంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. బాలీవుడ్ లో విడుదలైన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం బాగా నచ్చిందని అన్నారు. మరోవైపు తన తాజా చిత్రం ‘డేంజరస్’ ప్రమోషన్ పనుల్లో వర్మ బిజీగా ఉన్నారు. ఇద్దరు అమ్మాయిల మధ్య లెస్బియనిజం కథాంశంగా ఈ చిత్రాన్ని వర్మ తెరకెక్కించాడు.

Also Read: Ashoka Vanam lo Arjuna Kalyanam: అశోకవనంలో అర్జున కళ్యాణం.. పాట వచ్చేసింది
[…] Somu Veerraju Fires On YCP: ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు జనసేన, బీజేపీలు విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు విశ్రమించేది లేదని తెగేసి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయవాడ ధర్నా చౌక్ లో నిర్వహించిన ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే పనులు చేస్తూ ప్రజల్లో చులకన అవుతోందన్నారు. […]
[…] Varun Tej- Allu Arjun: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించనుండగా.. ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ రిలీజ్‌కి ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే సినిమా చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద్.. డైరెక్టర్, హీరోని పొగడ్తలతో ముంచెత్తారట. […]