https://oktelugu.com/

Bigg Boss 5: సినిమా క్యారెక్టర్లతో అదరగొట్టిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు…

Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్  5 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఏ సీజన్ అయినా 16 మంది కంటెస్టెంట్లతో మొదలయ్యేది… కానీ ఈ సారి 19 మందితో ఈ సీజన్ మొదలైంది. కాగా ప్రస్తుతం 6 గురు మాత్రమే మిగలగా… తమదైన శైలిలో హౌస్ మేట్స్ అందరూ గేమ్ ఆడుతూ అలరిస్తున్నారు. కాగా ఈ వారం బిగ్‌బాస్ ఫన్నీ టాస్కులతో సరదాగా సాగుతోంది. మధ్యలో సిరి-షన్ను రొటీన్ వ్యవహారాలు, కాజల్-శ్రీరామ్ మధ్య గొడవలతో కాస్త ఆసక్తికరం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 9, 2021 / 03:12 PM IST
    Follow us on

    Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్  5 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఏ సీజన్ అయినా 16 మంది కంటెస్టెంట్లతో మొదలయ్యేది… కానీ ఈ సారి 19 మందితో ఈ సీజన్ మొదలైంది. కాగా ప్రస్తుతం 6 గురు మాత్రమే మిగలగా… తమదైన శైలిలో హౌస్ మేట్స్ అందరూ గేమ్ ఆడుతూ అలరిస్తున్నారు. కాగా ఈ వారం బిగ్‌బాస్ ఫన్నీ టాస్కులతో సరదాగా సాగుతోంది. మధ్యలో సిరి-షన్ను రొటీన్ వ్యవహారాలు, కాజల్-శ్రీరామ్ మధ్య గొడవలతో కాస్త ఆసక్తికరం గానే మారింది. రోల్ ప్లే టాస్కుతో ఇంటి సభ్యులు ప్రేక్షకులను తెగనవ్వించారు. కాగా ఈరోజు ఎపిసోడ్ కూడా ఫన్నీగా సాగేలా కనిపిస్తోంది. ఈ మేరకు నేటి ఎపిసోడ్ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ప్రేక్షకులను ఓట్లు వేయమని అప్పీల్ చేసే అవకాశం టాస్కులో ఉత్తమ ప్రదర్శన చేసేవారికి దక్కుతుంది. అందులో భాగంగా నేటి టాస్కులో ఇంటి సభ్యులు తమ ఫేవరేట్ సినిమా క్యారెక్టర్లను పోషించాల్సి ఉంటుంది.

    Bigg Boss Telugu 5

    Also Read: ఎలిమినేటైన ప్రియాంక మరలా అలా హౌస్ లో ప్రత్యక్షమైంది

    కాగా కాజల్ అతిలోక సుందరి శ్రీదేవి పాత్రను, సన్నీ బాలయ్యలా, శ్రీరామ్ ముఠా మేస్త్రీ, సిరి జెనిలియాలా, మానస్ గబ్బర్ సింగ్, షణ్ముక్ పోలీస్ పాత్రలో కనిపించారు. బిగ్ బాస్ ఏర్పాటు చేసిన వేదికపై ప్లే అవుతున్న పాటకు తగ్గట్టు డ్యాన్సులతో వారంతా అదరగొట్టారు. అందరి కన్నా కాజల్ ఫుల్ జోష్ తో డ్యాన్సు చేసింది. చివరలో మానస్ గబ్బర్ సింగ్ పాటకు డ్యాన్సును ఇరగదీశాడు. మధ్యలో సన్నీ ఫన్నీ డైలాగులు కూడా కడుపుబ్బా నవ్వించాయి. కాజల్ ను ఉద్దేశించి ‘శ్రీదేవి గారిని చూసిన కళ్లతో నిన్ను చూడలేక…’ అంటూ కొట్టిన డైలాగుకు అందరూ పడిపడి నవ్వారు. మరి ఈ పూర్తి ఎపిసోడ్ కోసం రాత్రి వరకు ఎదురుచూడక తప్పదు.

    Also Read: కొట్టినా నువ్వే… తిట్టినా నువ్వే… అరె ఏం మాయ చేశావ్రా!