Homeఎంటర్టైన్మెంట్OKTelugu MovieTime: వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్

OKTelugu MovieTime: వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్

OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు అమ్మాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. టిక్కెట్ల అమ్మకాల కోసం ప్రభుత్వం టెండర్లు పూర్తి చేసింది. ప్రైవేట్ సంస్థల కంటే తక్కువగా ప్రభుత్వమే నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. అన్ని థియేటర్లు ఒకే సంస్థ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ చర్యతో బ్లాక్ టికెట్ల దందాకు చెక్ పెట్టాలని సర్కారు యోచిస్తోంది.

OKTelugu MovieTime
ap online cinema tickets

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. సరికొత్త కంటెంట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. ఇప్పటికే ఆహా వేదికగా అనేక సినిమాలు సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో భాగంగా సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌డానికి వెబ్ ఒరిజిన‌ల్ ఫిల్మ్ బ్ల‌డీ మేరితో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. నివేదా పేతురాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. త్వ‌ర‌లోనే బ్ల‌డీ మేరి ఆహాలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Also Read: Siva karthikeyan: ప్రముఖ నిర్మాత పై కేసు పెట్టిన స్టార్ హీరో.. కారణం అదే

Bloody Mary
Bloody Mary

అలాగే మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్-ఆలియా భట్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఈ చిత్ర పార్ట్ 1 షూటింగ్ పూర్తయింది. దాదాపు ఏడేళ్ల క్రితమే ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్లో అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకుడు. 2022 సెప్టెంబరు 9న.. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం మొదటి భాగం విడుదలకానుంది.

Brahmāstra
Brahmāstra

ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. పవన్కల్యాణ్ తన తదుపరి చిత్రం ‘హరిహర వీరమల్లు’ బ్యాలెన్స్ షూట్ కోసం సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రారంభంకానుంది. దీనికోసం కొన్ని భారీ సెట్లను తీర్చిదిద్దుతున్నారు. లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ తోట థరణి ఆధ్వర్యంలో ఈ సెట్స్ నిర్మాణం జరుగుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ట్వీట్ చేసింది. పవన్, తోటథరణి కలిసి ముచ్చటిస్తున్న ఫొటోను పోస్ట్ చేసింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version