https://oktelugu.com/

Siva karthikeyan: ప్రముఖ నిర్మాత పై కేసు పెట్టిన స్టార్ హీరో.. కారణం అదే

Sivakarthikeyan: హీరో శివ కార్తికేయన్ కు తమిళనాడులో స్టార్ హీరోగా మంచి పేరు ఉంది. అయితే.. ఆ పేరు కంటే కూడా.. శివ కార్తికేయన్ మంచి మనిషి అని.. నిర్మాతల బాగోగుల గురించి ఆలోచించే హీరో అని టాక్ ఉంది. ఇప్పుడు ఆ పేరే శివ కార్తికేయన్ కి మైనస్ అయ్యింది. సినిమా ఏవరేజ్ గా ఉంటే.. ఇచ్చే రెమ్యునరేషన్ లో సగం వెనక్కి ఇవ్వడం అనేది గతంలో ఎందరో హీరోలు చేసిందే. ఈ జెనరేషన్ లో […]

Written By: , Updated On : March 29, 2022 / 04:20 PM IST
Follow us on

Sivakarthikeyan: హీరో శివ కార్తికేయన్ కు తమిళనాడులో స్టార్ హీరోగా మంచి పేరు ఉంది. అయితే.. ఆ పేరు కంటే కూడా.. శివ కార్తికేయన్ మంచి మనిషి అని.. నిర్మాతల బాగోగుల గురించి ఆలోచించే హీరో అని టాక్ ఉంది. ఇప్పుడు ఆ పేరే శివ కార్తికేయన్ కి మైనస్ అయ్యింది. సినిమా ఏవరేజ్ గా ఉంటే.. ఇచ్చే రెమ్యునరేషన్ లో సగం వెనక్కి ఇవ్వడం అనేది గతంలో ఎందరో హీరోలు చేసిందే. ఈ జెనరేషన్ లో శివ కార్తికేయన్ కూడా ఆ కోవకు చెందిన హీరో.

Sivakarthikeyan

Sivakarthikeyan

మరి అలాంటి హీరో ఉన్నట్టు ఉండి.. ఒక నిర్మాత పై కేసు పెడితే షాక్ కాకుండా ఎలా ఉంటాం ? మంచితనానికి మారు పేరు అన్నట్టు ఉండే హీరో.. నన్ను మోసం చేశారు అని కేసు పెడితే.. ఆ వార్త వైరల్ కాకుండా ఎందుకు ఉంటుంది ? మొత్తానికి వైరల్ అయ్యింది. ఇంతకీ డిటైల్స్ లోకి వెళ్తే.. కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్‌ రాజాపై కేసు నమోదు చేశారు.

Also Read: Vijay Deverakonda Puri Jagannadh Jana Gana Mana: ‘జనగణమన’తో నేలకు దూకుతున్న విజయ్ దేవరకొండ

నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా తనకు పారితోషికం ఇవ్వలేదని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఒప్పందం ప్రకారం 2019లో మిస్టర్ లోకల్ సినిమా కోసం రూ.15 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తామన్నారు… కానీ రూ.11 కోట్లు మాత్రమే చెల్లించారని తెలిపాడు. మిగిలిన రూ.4 కోట్లు చెల్లించలేదని పేర్కొన్నారు. కాగా ఈ కేసు గురువారం విచారణకు రానుంది. మొత్తానికి అటు తమిళ ఇటు తెలుగులోనూ స్టార్ డమ్ పెంచుకున్న హీరో కేసుకు సంబంధించిన వార్త కాబట్టి.. ఈ వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.

శివ కార్తికేయన్ తన సినిమా పారితోషికం విషయంలో నిర్మాత జ్ఞానవేల్ రాజా మోసం చేశాడు అంటున్నారు. తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ పూర్తిగా ఇవ్వలేదని.. ఇచ్చేలా చూడాలని ఆయన .. మద్రాస్ కోర్టును ఆశ్రయించాడు. మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ‘మిస్టర్ లోకల్’ సినిమా విషయంలో ఇది జరిగింది.

Sivakarthikeyan

Sivakarthikeyan

పైగా నిర్మాత టీడిఎస్ కట్టలేదు అట. దాంతో తన అకౌంట్ నుంచి 91 లక్షలు కట్ అయ్యాయని.. ఈ విషయంలో పూర్తి బాధ్యత నిర్మాత జ్ఞానవేల్ రాజా తీసుకోవాలని శివకార్తికేయన్ డిమాండ్ చేశాడు. పైగా తనకు రావాల్సిన 4 కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఇప్పించాలని అడుగుతున్నాడు.

Also Read: Bigg Boss Non Stop OTT Telugu: బిగ్ బాస్: మాటలతోనే తూటాల్లా పేలిపోయారు

Tags