Bro Pre Release Event: నేడు బ్రో ప్రీ రిలీజ్ వేడుక కాగా… ఆసక్తికర చర్చ నడుస్తుంది. బ్రో చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. మూల కథలో కూడా మార్పులు చేశారు. అసలు వినోదయ సితం రీమేక్ వెనుక త్రివిక్రమ్ కర్త కర్మ క్రియగా ఉన్నారు. కాబట్టి బ్రో ప్రీ రిలీజ్ వేడుకకు త్రివిక్రమ్ రావడం ఖాయం. అయితే బండ్ల గణేష్ కి ఆహ్వానం ఉంటుందా? అనేది ఆసక్తికర పరిణామం. పవన్ కళ్యాణ్ గత చిత్రం భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక ఓ వివాదానికి దారి తీసింది. తనకు ఆహ్వానం అందకపోవడంతో బండ్ల గణేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
అందుకు త్రివిక్రమ్ కారణం అంటూ అనుచిత కామెంట్స్ చేశాడు. వాడు వీడు అంటూ రెచ్చిపోయాడు. పవన్ కళ్యాణ్ అభిమానితో బండ్ల గణేష్ మాట్లాడిన ఆడియో కాల్ రికార్డు లీక్ కాగా వివాదాస్పదమైంది. ఆ వాయిస్ నాది కాదని బండ్ల గణేష్ ఖండించారు. బండ్ల వ్యాఖ్యలకు త్రివిక్రమ్ కూడా హర్ట్ అయ్యారేమో కానీ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేదు. ఈ ఘటన జరిగాక పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ని కలవలేదు.
బండ్ల గణేష్ మీద పవన్ కళ్యాణ్ కోపంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. కాగా నేడు బ్రో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక కాగా బండ్ల గణేష్ కి పిలుపు ఉంటుందా లేదా అనే చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ మీద కోపం తగ్గిందని ఒక వాదన. పవన్ కళ్యాణ్ తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ గా వీడియో విడుదల చేశారు. అందులో పలువురు నటులతో కూడిన ఫోటోలు జోడించారు. తనకు నచ్చిని వాళ్ళ ఫోటోలు పెట్టలేదు. మోహన్ బాబు, ఆలీల ఫోటోలు పవన్ కళ్యాణ్ పోస్ట్ చేసిన వీడియోలో లేవు.
బండ్ల గణేష్ తో దిగిన ఫోటో అయితే ఉంది. కాబట్టి బండ్ల గణేష్ మీదున్న కోపం పోయిందంటున్నారు. కాబట్టి బ్రో రిలీజ్ వేడుకకు బండ్ల వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం అంటున్నారు. ఒకవేళ త్రివిక్రమ్, బండ్ల గణేష్ బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైతే పవన్ ని పొగిడే విషయంలో వాళ్ళ మధ్య పోటీ ఇలా ఉంటుందంటూ…ఓ మీమ్ వీడియో వైరల్ అవుతుంది. అది అద్బుతంగా ఉంది. ఈ వీడియో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
https://twitter.com/tweetsraww/status/1683703097183596545