Tollywood Heroes Wives: సినీ సెలబ్రెటీల గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. గతంలో వారి గురించి తెలుసుకోవాలంటే కేవలం సినీ పత్రికలే మాధ్యమాలుగా ఉండేవి. కానీ సోషల్ మీడియా వచ్చిన తరువాత వారి గురించే కాకుండా వారి కుటుంబ సభ్యుల గురించి కూడా తెలిసిపోతుంది. కొందరు ఎప్పటికప్పుడు తమ గురించి సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తున్నారు. మరి కొందరు స్టార్లతో కలిసి పలు ఫంక్షన్లలో పాల్గొంటున్నారు. గతంలో స్టార్ హీరోల సతీమణుల గురించి అయితే అస్సలు తెలియకపోవు. కానీ ఇప్పుడు హీరోలతో సమానంగా వారు ఏం చేస్తున్నారో చెబుతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబులు వారి సతీమణిల గురించి పరిచయం చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే వారు ఊరికే ఇంట్లో కూర్చోలేదు. వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. ఎవరెవరు ఏ రంగంలో రాణిస్తున్నారో ఒకసారి పరిశీలిస్తాం..
నమ్రతా శిరోద్కర్(మహేష్ బాబు):
మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ లది లవ్ మ్యారేజ్. రెండు, మూడు సినిమాల్లో ఈమె హీరోయిన్ గా నటించారు కూడా. అయితే మహేష్ తో పెళ్లయిన తరువాత నమ్రతా సినిమాల్లోకి రావడం లేదు. కానీ మహేష్ కు సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ గురించి బాధ్యతలు తీసుకున్నారు. మహేష్ బ్రాండ్ తో హంబుల్ అనే టెక్స్ టైల్స్ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు. ఓ వైపు వీటిని నిర్వహిస్తూనే మరోవైపు ఏఎంబీ పేరుతో మల్టీ ఫ్లెక్స్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
లక్ష్మీ ప్రణతి (జూనియర్ ఎన్టీఆర్):
జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో అని అందరికీ తెలుసు. కానీ ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి గురించి విషయాలు తక్కువ మందికే తెలుసు. స్టూడియో ఎన్ అధినేత కూతురు అయిన ఆమె త్వరలో ఓ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ను స్టార్ట్ చేస్తున్నారట.
ఉపాసన (రామ్ చరణ్):
మెగా హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆమె ఎప్పుడు రామ్ చరణ్ గురించి సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తూ ఉంటుంది. అయితే ఆమె ఓ వైపు అపోలో హాస్పిటల్స్ కు డైరెక్టర్ గా ఉన్నారు. మరోవైపు ఎయిర్ లైన్స్ బిజినెస్ లో చురుగ్గా పాల్గొంటారు.
స్నేహిత రెడ్డి (అల్లు అర్జున్):
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. ఆయన సతీమణి సైతం బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. స్నేహరెడ్డి తండ్రి స్థాపించిన సెయింట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
అంజనీ దేవి (నాని):
నాని గురించి తెలిసినంతగా ఆమె భార్య అంజనీ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. కానీ ఆమె కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వారే. అంజనీ దేవి ఆర్కే మీడియాలో క్రియేటివ్ హెడ్ గా ఉన్నారు. ఈమె బాహుబలి సినిమాకు పనిచేయడం విశేషం.
విరూప కంటమనేని (అల్లరి నరేష్):
స్టార్ హీరో అల్లరి నరేష్ భార్య కూడా వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను ఏర్పాటు చేశారు.ఈ రంగంలో పలు అవార్డులు కూడా అందుకున్నారు.