Akhanda: బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరక్కిస్తోన్న చిత్రం అఖండ. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్ సాంగ్ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. పూర్తి పాటను ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇందులో బాలయ్య బాలయ్య విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ఇది. గతంలో సింహా, లెజెండ్ చిత్రాలతో బ్లాక్‌బస్టర్ కొట్టారు. ఇప్పుడు ఈ సినిమాలో బాక్సాఫీసు బద్దలు కొట్టాలని చూస్తున్నారు.
ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతమందించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది.
కాగా, ఆహా ఓటీటీ వేదికగా బాలయ్య ఓ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే పేరుతో నడుస్తున్న ఈ షోకు బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. నవంబరు 4న తొలి ఎపిసోడ్ ఆహాలో రిలీజ్ కానుంది. తొలి ఎపిసోడ్లో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గెస్ట్‌గా రానుంది. ఇప్పటికే ఇందుకు సంబందించిన ప్రోమోను విడుదల చేసింది షోయూనిట్. దీంతో షోపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఎప్పుడూ గరమ్ గరమ్‌గా కనిపించే బాలయ్య ఈ షోలో ఎలా కనిపించనున్నారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
