https://oktelugu.com/

Karthika Deepam: పెద్ద గండం నుంచి బయటపడిన డాక్టర్ బాబు.. కార్తీక్ కుటుంబాన్ని కీలుబొమ్మను చేసి ఆడిస్తున్న మోనిత..!

బుల్లి తెర పై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఆసక్తికరంగా మారుతోంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా దీప జరిగిన అన్యాయం గురించి తెలుసుకొని బాధపడుతుంది. సౌందర్య కార్తీక్ బజారుకు వెళ్లి శాంతి పూజకు కావలసిన సామాన్లు కొంటారు.అదే సమయంలో కార్తీక్ మాట్లాడుతూ ఏంటి మమ్మీ శాంతి పూజ సామాన్లు నేను ఈ పూజ చేయడానికి రాను. పూజ చేయడానికి వస్తే మోనిత పక్కన కూర్చోవాలి. అలా తన పక్కన కూర్చుంటే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 4, 2021 / 11:39 AM IST
    Follow us on

    బుల్లి తెర పై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఆసక్తికరంగా మారుతోంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా దీప జరిగిన అన్యాయం గురించి తెలుసుకొని బాధపడుతుంది. సౌందర్య కార్తీక్ బజారుకు వెళ్లి శాంతి పూజకు కావలసిన సామాన్లు కొంటారు.అదే సమయంలో కార్తీక్ మాట్లాడుతూ ఏంటి మమ్మీ శాంతి పూజ సామాన్లు నేను ఈ పూజ చేయడానికి రాను. పూజ చేయడానికి వస్తే మోనిత పక్కన కూర్చోవాలి. అలా తన పక్కన కూర్చుంటే అన్నిటికీ తాను ఒప్పుకున్నట్లే కదా మమ్మీ నేను రాను అంటూ కార్తీక్ వాదిస్తాడు. అయినా ఈ పూజ చేస్తున్నది దీప కోసం. నువ్వు క్షేమంగా ఉంటేనే కదరా దీప పిల్లలు క్షేమంగా ఉంటారు అంటూ సౌందర్య చెబుతుంది. అయినా కార్తీక్ ఒప్పుకోడు.

    ఇక అదే సమయంలో అక్కడ ఒక ఎలక్ట్రిక్ వర్క్ జరుగుతుండగా కరెంట్ వైరు తెగి కార్తీక్ కారుపై పడుతుంది.అది చూసిన ఒక వర్కర్ దూరంనుంచి సార్ ఆ కారును తాకద్దు అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక కార్తీక్ కారును తాకుతుండగా వెంటనే అతను వచ్చి తనని పక్కకు లాగి ఏంటి సార్ చచ్చిపోదాం అనుకున్నారా కారుపై కరెంటు తీగ పడింది. కొంత లేట్ అయితే చనిపోయే వాళ్ళు మీ భార్య మాంగల్యం గట్టిదని చెబుతాడు. ఇక ఈ విషయం విన్న సౌందర్య ప్రియమణి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది. చూశావా రా నీ ముందే గండం అంటే ఏందో కనిపిస్తుంది ఈ పూజకు ఒప్పుకో అంటూ కార్తీక్ ను బలవంత పెడుతుంది.

    ఇక కట్ చేస్తే దీప గురించి ప్రియమణి మాట్లాడుతూ దీపమ్మ కోటీశ్వరుల ఇంటికి కోడలు,దీపమ్మ చాలా మంచిది అయిన ఆమెకు మనశ్శాంతి లేదు ఏంటో కొన్ని జీవితాలు అంతే ఉంటాయి అంటూ మనసులో అనుకుంటుంది. ఇక కార్తీక దీపతో మాట్లాడే ప్రయత్నం చేసిన దీప పొడిపొడి మాటలు చెబుతుంటే కార్తీక్ తనకి ఇంకా కోపం తగ్గలేదు అని భావిస్తాడు. ఇక మోనితను పూజకు ఎలా పిలవాలి అంటూ సౌందర్య మదన పడుతుంది. తనని జైల్లో అన్న మాటలను గుర్తు చేసుకొని నేను పిలిస్తే తను వస్తుందా అంటూ ఆలోచిస్తూ భారతికి ఫోన్ చేస్తుంది. ఇక జరిగిన విషయమంతా భారతికి చెప్పి తనని తీసుకురా అంటూ సౌందర్య చెప్పడం దీప వింటుంది.

    నాకు తెలియకుండా ఏదో జరుగుతున్నది ఏంటో శాంతి పూజ అంటున్నారు ఏం జరుగుతుంది అంటూ దీపా ఆలోచిస్తుంది. ఇక ఇంటికి వెళ్ళిన మోనిత ప్రియమణి పిలిపించుకుని ఇక మనకు అన్ని మంచి రోజులు వచ్చాయి ప్రియమణి ఇక కార్తీక్ కుటుంబాన్ని మనం కీలుబొమ్మలా ఆడించబోతున్నాము. మనం ఏం చెబితే అక్కడ అదే జరుగుతుంది అంటూ సంబర పడుతుంది. ఇక తర్వాతి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.