https://oktelugu.com/

Squid Game 3 : ‘స్క్విడ్ గేమ్ 3’ లో టైటానిక్ హీరో..షూటింగ్ పూర్తి..ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అవ్వబోతుందంటే!

మన ఇండియన్ ఆడియన్స్ కి అమితంగా నచ్చిన కొరియన్ వెబ్ సిరీస్ లలో ఒకటి 'స్క్విడ్ గేమ్'..లాక్ డౌన్ సమయంలో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : January 1, 2025 / 05:42 PM IST

    Squid Game 3

    Follow us on

    Squid Game 3 : మన ఇండియన్ ఆడియన్స్ కి అమితంగా నచ్చిన కొరియన్ వెబ్ సిరీస్ లలో ఒకటి ‘స్క్విడ్ గేమ్’..లాక్ డౌన్ సమయంలో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. మన ఇండియన్ ఆడియన్స్ కూడా ఈ వెబ్ సిరీస్ ని విపరీతముగా ఇష్టపడ్డారు. సీజన్ 2 కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసారు. ఎట్టకేలకు సీజన్ 2 డిసెంబర్ 25 వ తారీఖున నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. మొదటి సీజన్ కి వచ్చిన రెస్పాన్స్ రేంజ్ లోనే రెండవ సీజన్ కి కూడా వచ్చింది కానీ, క్లైమాక్స్ మాత్రం ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. సరైన ఎండింగ్ తో సీజన్ ని ముగించలేదని, చాలా అసంపూర్ణంగా ఉందంటూ ఈ సీజన్ ని చూసిన ప్రతీ ఒక్కరు పెదవి విరిచారు. కంక్లూజన్ మూడవ సీజన్ లోనే తెలుస్తుందని క్లైమాక్స్ ఎపిసోడ్ లో చెప్పుకొచ్చారు.

    మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడే ఈ స్క్విడ్ గేమ్ ని ఎలా అయినా ఆపాలి అనే ఉద్దేశ్యంతో రెండవసారి ఆ గేమ్ ని ఆడేందుకు వచ్చిన హీరో, ఎట్టకేలకు తెగించి స్క్విడ్ గేమ్ నిర్వాహకుల సైన్యాన్ని హత మార్చే ప్లాన్ వేసాడు. చాలా వరకు సక్సెస్ అయ్యాడు కానీ, చివర్లో నిర్వాహకులకు దొరికిపోతాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది తదుపరి సీజన్ లో చూడాల్సిందే. అయితే ఈ సీజన్ ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో లెనార్డో డీకాప్రియో నటిస్తున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. ఈయన టైటానిక్ చిత్రం లో హీరో. హాలీవుడ్ లో ఇప్పటికీ చెక్కు చెదరని స్టార్ స్టేటస్ తో సినిమాలు చేస్తున్న నటుడు. ఇతని నటనకు ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. అలాంటి నటుడిని సీజన్ 3 కోసం తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సీజన్ లో కేవలం కొరియన్ నటీనటులు మాత్రమే చేసారు.

    మొట్టమొదటిసారి అమెరికన్ నటుడు ఈ సిరీస్ లో నటించబోతున్నాడు. అయితే ఆయనది పాజిటివ్ క్యారక్టరా?, లేదా నెగటివ్ క్యారక్టరా? అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం గేమ్ ఆడేందుకు కంటెస్టెంట్స్ ఇంకా చాలా మంది మిగిలి ఉన్నారు. మళ్ళీ కొత్త గేమ్స్ మొదలు అయ్యే అవకాశాలు లేదు. లెనార్డో డికాప్రియో ఈ సిరీస్ లోకి అడుగుపెడితే, ఆయన ఉంటే విలన్స్ గ్యాంగ్ లో ఒకడిగా ఉండాలి, లేకపోతే ఈ గేమ్స్ నిర్వహిస్తున్న దీవిని వెతికి, అమాయకులైన కంటెస్టెంట్స్ ని కాపాడేందుకు వస్తున్న హీరో గ్యాంగ్ వైపు అయినా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఆయన హీరోల గ్యాంగ్ వైపు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ దీవిని ఎంత వెతికినా కనపడడం లేదు. కేవలం అది లినార్డో కి మాత్రమే ఆ దీవిని వెతికే సత్తా ఉన్నట్టుగా ఈ సిరీస్ లో చూపించే అవకాశం ఉంది. చూడాలి మరి ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఈ చివరి సీజన్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.