https://oktelugu.com/

Sai Pallavi : సాయి పల్లవి అమీర్ ఖాన్ కొడుకు జాతకాన్ని మార్చబోతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామందికి స్టార్ హీరోలు గుర్తొస్తుంటారు. కానీ కొంతమంది స్టార్ హీరోయిన్స్ సైతం వాళ్ల స్టార్ డమ్ ను పెంచుకుంటున్న ముందుకు సాగుతున్నారనే విషయం మనలో చాలామందికి తెలియదు.

Written By:
  • Gopi
  • , Updated On : January 1, 2025 / 05:37 PM IST

    Sai Pallavi

    Follow us on

    Sai Pallavi : తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామందికి స్టార్ హీరోలు గుర్తొస్తుంటారు. కానీ కొంతమంది స్టార్ హీరోయిన్స్ సైతం వాళ్ల స్టార్ డమ్ ను పెంచుకుంటున్న ముందుకు సాగుతున్నారనే విషయం మనలో చాలామందికి తెలియదు. నిజానికి సాయి పల్లవి లాంటి హీరోయిన్ ఫిదా సినిమాతో తెలుగులోకి ఏంటి ఇచ్చినప్పటికి ఆమె అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు హీరోలతో పోటీ పడుతూ మరి తన స్టార్ డమ్ ను విస్తరించుకుంటుందనే చెప్పాలి…

    సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది నటీమణులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి వాళ్లలో సాయి పల్లవి ఒకరు. ప్రస్తుతం ఆమె ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా నటిగా ఆమెకి మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. ముఖ్యంగా ఆమె ఎంచుకున్న సబ్జెక్టులు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటూ ఉండటం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆమె ఇతర భాషల సినిమాలతో కూడా బిజీగా ఉంటూ ముందుకు సాగుతుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అమీర్ ఖాన్ కొడుకు అయిన ‘జునైద్ ఖాన్’ మూవీలో కూడా తన హీరోయిన్ గా నటిస్తూ ఉండడం విశేషం… ఇక అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ గత సంవత్సరం ‘మహారాజా’ అనే ఒక వెబ్ సిరీస్ చేసినప్పటికి అంత పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. పైగా అతని మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. మరి ఎట్టకేలకు సాయి పల్లవితో సినిమా చేసి మంచి విజయాన్ని దక్కించుకోవాలనే ప్రయత్నం లో ఉన్నట్టుగా తెలుస్తోంది… అందుకే జునైద్ ఖాన్ హీరోగా చేస్తున్న ‘ఏక్ దిన్ ‘ సినిమాలో తనని హీరోయిన్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది…ఇక ఇప్పటికే సాయి పల్లవి ఈ సంవత్సరంలో అమరన్ సినిమాతో శివ కార్తికేయన్ కి భారీ సక్సెస్ ని అందించింది.

    కాబట్టి సాయి పల్లవి సినిమాలో ఉంటే చాలు ఆ సినిమాకు మార్కెట్ అవ్వడమే కాకుండా సినిమా సూపర్ సక్సెస్ అవుతుందనే ఒక నమ్మకంతో మేకర్స్ అయితే ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటివరకు వీళ్ళు చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతున్నవే కావడం విశేషం…

    మరి సాయి పల్లవి బాలీవుడ్ లో రామాయణం సినిమాలో సీతగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. దాంతో పాటుగా మరికొన్ని ప్రాజెక్టులకు కూడా ఆమె ఓకే చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక పాన్ ఇండియాలో ఆమె హవా ఇప్పుడు కొనసాగుతుంది. తెలుగులో ఆమె నాగచైతన్య హీరోగా వస్తున్న తండేల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

    మరి ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతుందంటూ దర్శకుడు చందు మొండేటి చెబుతుండడం విశేషం…ఇక ఈ సినిమాలు రిలీజై మంచి విజయాలను సాధించి ఆమెకు స్టార్ డమ్ ను కట్టబెడతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు సాయి పల్లవి హవానే కొనసాగుతుంది…ఆమెకోసం స్టార్ హీరోలు సైతం వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి…