Srikakulam : శ్రీకాకుళం జిల్లా అంటేనే కష్టజీవులు గుర్తుకొస్తారు. అయితే ఆ కష్టంతో పాటు ప్రతి పనిలో మొండితనం ఉంటుంది. అందుకే ఎక్కడైనా పరిశ్రమల ఏర్పాటు సమయంలో ఇక్కడి వారు అవసరం అవుతారు. అదే కాదు.. శ్రీకాకుళం భాష, యాస ప్రత్యేకంగా ఉంటుంది. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు కూడా. తాజాగా ఓ వ్యక్తి మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి వైర్లపై పడుకున్నాడు. ఆ ఘటన శ్రీకాకుళం జిల్లాలోనే జరిగింది. దీంతో సోషల్ మీడియా హోరెత్తింది. శ్రీకాకుళం వోడంతే ఇట్టానే ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. పూర్వపు శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం ఎం. సింగుపురం లో వెలుగు చూసింది ఈ ఘటన. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో. గ్రామానికి చెందిన ఎజ్జల వెంకన్నకు మద్యం తాగే అలవాటు ఉంది. షాపు వద్దకు వెళ్లి మద్యం సేవించాడు. అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. నేరుగా విద్యుత్ స్తంభం వద్దకు వెళ్లాడు. మత్తులో ఉండడంతో అక్కడ స్తంభాన్ని ఎక్కేశాడు. మీద హై టెన్షన్ విద్యుత్ వైర్లపై పడుకున్నాడు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
* విద్యుత్ సరఫరా నిలిపివేతతో
అసలు వెంకన్న విద్యుత్ స్తంభం ఎందుకు ఎక్కాడో ఎవరికీ తెలియదు. దీంతో స్థానికులు హుటాహుటిన విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వెంకన్నను కిందకు దించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన అంగీకరించలేదు. కిందకు దిగేందుకు మొండికేశాడు. కొద్దిసేపు స్థానికులు బతిమలాడడంతో కిందకు దిగాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందని ఆరా తీస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
* తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో
షాపు వద్ద మద్యం తాగి ఇంటికి వెళ్ళాడు వెంకన్న. మళ్లీ మందు కోసం డబ్బులు ఇవ్వమని తల్లిని అడిగాడు. ఆమె నిరాకరించడంతో ఆ కోపంలో వెళ్లి విద్యుత్ స్తంభం ఎక్కి వైర్లపై పడుకున్నాడు. అయితే ఆ సమయానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకుంటే పరిస్థితి మరోలా ఉండేది. మొత్తానికి అయితే ఈ మందు బాబు ప్రజలను పరుగులు పెట్టించాడు.
Orey Maa srikakulam vaade #HappyNewYear2025 pic.twitter.com/MxAjQuZc41
— Pawanism™ (@Dileepspk18) January 1, 2025