Thiragabadara Saami Movie Review: ‘తిరగబడర సామి ‘ ఫుల్ మూవీ రివ్యూ…

రాజ్ తరుణ్.. 'తిరగబడరా సామి' అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : August 3, 2024 8:26 am

Thiragabadara Saami Movie Review

Follow us on

Thiragabadara Saami Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రాజ్ తరుణ్… ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన కెరియర్ స్టార్టింగ్ లోనే వరుసగా మూడు సినిమాలతో సక్సెస్ లను అందుకొని ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదుగుతాడని అందరూ అనుకున్నప్పటికీ వాళ్ల అంచనాలను తారుమారు చేస్తూ ఆయన నార్మల్ హీరో గానే ఇప్పటివరకు కొనసాగుతున్నాడు. మరి ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఆయన చేసిన ‘తిరగబడర సామి’ అనే సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం ఆయన పర్సనల్ గా కొన్ని వివాదాలను ఎదుర్కొంటున్న రాజ్ తరుణ్ సినిమాలా విషయం లో మాత్రం ఎక్కడ తగ్గడం లేదు…గతవారం ‘పురుషోత్తముడు ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అది ఆశించిన విజయాన్ని అందించలేదు. ఇక దాంతో ఈ వారం ‘తిరగబడరా సామి’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే గిరి (రాజ్ తరుణ్) అనే వ్యక్తి చిన్నతనం లోనే వాళ్ల అమ్మానాన్న లకు దూరం అయి అనాధగా పెరుగుతాడు. ఇక ఆ ఉద్దేశ్యంతోనే తనలా ఎవరు ఇబ్బంది పడకూడదని పేరెంట్స్ నుంచి దూరమైన పిల్లలను వాళ్ళ పేరెంట్స్ తో కలుపుతూ ఉంటాడు. దీనివల్ల ఆయన చాలావరకు సాటిస్ఫై అవుతూ ఉంటాడు… ఇక ఈ క్రమంలోనే శైలేజా (మాల్వీ మల్హోత్రా) కి గిరి కి మధ్య ప్రేమ చిగురించి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఇక అంతలోనే కొండారెడ్డి (మకరంద్ దేశ్ పాండే) శైలేజా కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక గిరి తో శైలజను వెతికి పెట్టామని చెబుతాడు లేకపోతే గిరి ని చంపేస్తానని బెదిరిస్తాడు. అసలు శైలేజా కి కొండారెడ్డి కి మధ్య సంబంధం ఏంటి? గిరి వాళ్ళను ఎలా ఎదురించి తన భార్య ను కాపాడుకున్నాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సినిమా దర్శకుడు అయిన ఏ యస్ రవికుమార్ చౌదరి తనదైన రీతిలో సినిమా చేసి సక్సెస్ కొడుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ రొటీన్ రొట్ట కథతో సినిమా తీసి మరోసారి ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో యంగ్ డైరెక్టర్లు వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ భారీ వండర్స్ ను క్రియేట్ చేయడమే కాకుండా హాలీవుడ్ ఇండస్ట్రీకి పోటీని ఇచ్చే విధంగా సినిమాలు చేస్తుంటే, ఈయన మాత్రం ఇప్పటికీ కూడా రొటీన్ రొట్ట ఫార్ములా కథలను ఎంచుకొని సినిమాలు చేయడం అనేది కొంత వరకు ఇబ్బంది కలిగించే అంశామనే చెప్పాలి…

ఇక ఏ యస్ కుమార్ చౌదరి అంటే గతంలో యజ్ఞం, నువ్వు లేని జీవితం లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలను తీసి ఇప్పుడు ఇలాంటి ఒక డిజాస్టర్ సినిమా తీయడం అనేది అతని అభిమానులకు తీవ్రంగా కలిగించే అంశం అనే చెప్పాలి. కథలో పెద్దగా విషయమేమీ లేదు. ఇక కథనంలో అయిన కొంతవరకు వైవిధ్యాన్ని చూపెడతారేమో అనుకుంటే అందులో కూడా పెద్దగా వైవిధ్యం అయితే ఏమీ లేదు. ఇక రాజ్ తరుణ్ కూడా వరుసగా తన ప్లాప్ లా పరంపరను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడనే చెప్పాలి. ప్రేక్షకులు ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే రాసుకోవడంలో కూడా ఆయన చాలా వరకు తడబడ్డాడు. ఇక స్క్రీన్ ప్లే కూడా అంత కొత్తగా ఏమి రాసుకోలేదు…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఈ సినిమాలో తన క్యారెక్టర్ లి సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చేంత స్కోప్ అయితే లేదు. ఇక ఆయన గత సినిమాలతో ఎలాగైతే చేశాడో ఇప్పుడు కూడా అలానే చేశాడు అంతే తప్ప కొత్తదనం ఏమి ప్రదర్శించలేదనే చెప్పాలి… ఇక మాల్వి మల్హోత్రా కి ఇది మొదటి సినిమా అయినప్పటికి తన పాత్ర పరిధి మేరకు చాలా బాగా నటించి మెప్పించింది. ఇక మకరంధ్ దేశ్ పాండే కూడా విలనిజాన్ని పండిస్తూ తనకున్న లిమిటేషన్స్ లోనే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నటించాడు. రఘు బాబు, తాగుబోతు రమేష్, గీతా సింగ్ లాంటి నటీ నటులు వాళ్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన జేబీ అంత మంచి మ్యూజిక్ అయితే ఇవ్వలేదు. ఇక సీన్లలో డెప్త్ లేనప్పుడు ఆయన మాత్రం ఎలాంటి మ్యూజిక్ క్రియేట్ చేసిన పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ అవ్వదనే ఉద్దేశంలో ఆయన కూడా లైట్ తీసుకుని మ్యూజిక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది… ఇక సినిమాటోగ్రాఫర్ జవహర్ రెడ్డి కొన్ని సీన్లలలో అద్భుతమైన మేకింగ్ కనపర్చినప్పటికీ ఈ సినిమా మొత్తంలో మాత్రం అంత మ్యాజిక్ అయితే చేయలేకపోయాడు. ఇక ఈ సినిమాను సక్సెస్ చేయడంలో టెక్నికల్ టీం చాలా వరకు వెనుకబడిపోయిందనే చెప్పాలి…ఇక ఎడిటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది…

ప్లస్ పాయింట్స్

అక్కడక్కడ కొన్ని సీన్లు బాగున్నాయి…

మైనస్ పాయింట్స్

కథ
స్క్రీన్ ప్లే
లాగ్ సీన్లు…

రేటింగ్

ఇక ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 1.5/5

చివరి లైన్
‘తిరగబడరా సామి’ అన్నట్టుగానే ఈ సినిమా తిరగబడింది…