https://oktelugu.com/

Raj Tarun Lavanya: రాజ్ తరుణ్ వివాదంలో మరో ట్విస్ట్! అడ్డంగా బుక్కైన ప్రియురాలు లావణ్య!

లావణ్య-రాజ్ తరుణ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ గొడవలోకి తాజాగా ఆర్జే శేఖర్ బాషా, ప్రీతి ఎంట్రీ ఇచ్చారు. వారు లావణ్య మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. లావణ్య మాకు డ్రగ్స్ అలవాటు చేసింది. ఇప్పటికీ ఫోన్లు చేసి వేధిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : August 3, 2024 / 08:40 AM IST

    Raj Tarun Lavanya

    Follow us on

    Raj Tarun Lavanya: లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ పై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. పదేళ్లకు పైగా తనతో సహజీవనం చేసిన రాజ్ తరుణ్ వదిలించుకోవాలి అనుకుంటున్నాడు. రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రా తో ఎఫైర్ పెట్టుకున్నాడు. అందుకే నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. రాజ్ తరుణ్ గతంలో నన్ను వివాహం చేసుకున్నాడు. రెండు సార్లు అబార్షన్ చేయించాడని కీలక ఆరోపణలు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. హీరో రాజ్ తరుణ్ కి నోటీసులు కూడా పంపారు.

    లావణ్య వివాదం నేపథ్యంలో రాజ్ తరుణ్ మీడియా ముందుకు రావడానికి కూడా భయపడ్డాడు. తాను నటించిన పురుషోత్తముడు చిత్రాన్ని ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా విడుదల చేశారు. ఆగస్టు 2న మరో చిత్రం తిరగబడరసామీ విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రాజ్ తరుణ్ మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆయనకు లావణ్యకు సంబంధించిన అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి.

    లావణ్య ఆరోపణల్లో నిజం లేదు. నా దగ్గర కూడా చాలా ఆధారాలు ఉన్నాయి. అవి నా లాయర్ కి ఇచ్చాను. ఏదేమైనా నేను లీగల్ గా లావణ్య కేసు ఎదుర్కొంటాను అన్నాడు. అబార్షన్ చేయించిన విషయం నిజమైతే పోలీసులు ఆ సెక్షన్ ఎందుకు పెట్టలేదు. దయచేసి ఆ వివాదం వదిలేయండి. తిరగబడరసామీ మూవీ గురించి అడగండని రాజ్ తరుణ్ మీడియాతో అన్నాడు.

    ఈ మూవీ హీరోయిన్ మాల్వి మల్హోత్రా పై కూడా లావణ్య కేసు పెట్టింది. రాజ్ తరుణ్-మాల్వి మల్హోత్రా రిలేషన్ లో ఉన్నారనేది లావణ్య ప్రధాన ఆరోపణ. రాజ్ తరుణ్ తో పాటు తిరగబడర సామీ మూవీ ప్రమోషన్స్ కి హాజరైన మాల్వి మల్హోత్రా సైతం స్పందించారు. అసలు లావణ్య ఎవరో నాకు తెలియదు? ఆమెను నేను ఎప్పుడూ కలవలేదు? ఆమె నాకు, నా బ్రదర్ కి పంపిన మెసేజ్ ఆధారంగా నేను కేసు పెట్టాను, అన్నారు.

    ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఆర్జే శేఖర్ బాషా ఇన్వాల్వ్ అయ్యాడు. రాజ్ తరుణ్ ని ఎందుకు వేధిస్తున్నావని లావణ్యతో ఫోన్లో మాట్లాడిన శేఖర్ బాషా ఆడియో కాల్ వైరల్ అయ్యింది. లావణ్య, శేఖర్ బాషాలను ఓ ఛానల్ డిబేట్ కి పిలిచింది. శేఖర్ బాషా మీదకు లావణ్య చెప్పు విసిరిన వీడియో వైరల్ అయ్యింది. తాజాగా శేఖర్ బాషాతో పాటు ప్రీతి అనే యువతి లావణ్య మీద కేసు పెట్టారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

    లావణ్య మాకు గత మూడేళ్ళుగా తెలుసు. ఆమె మాకు డ్రగ్స్ అలవాటు చేసింది. డ్రగ్స్ విషయంలో ఇప్పటికీ కాల్స్ చేసి ఇబ్బంది పెడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. శేఖర్ బాషా, ప్రీతి ఆరోపణలను లావణ్య ఖండించారు. కాగా లావణ్య, రాజ్ తరుణ్ లకు సోషల్ మీడియా వేదికగా పరిచయం ఏర్పడింది. రాజ్ తరుణ్ హీరో కాకముందు నుండే స్నేహం కొనసాగుతుంది. అది ప్రేమకు దారి తీసింది. లావణ్య గతంలో మంచిది. చెడు స్నేహాల వలన డ్రగ్స్ కి అలవాటు పడిందని రాజ్ తరుణ్ ఆరోపిస్తున్నాడు.