Tiger Nageswara Rao Teaser Review: కొన్ని బయోపిక్స్ సినిమాకు మించిన నాటకీయత కలిగి ఉంటాయి. స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం అలాంటిదే. ఇండియన్ రాబిన్ హుడ్ గా నాగేశ్వరరావు పేరుగాంచాడు. 70లలో టైగర్ నాగేశ్వరరావు నేషనల్ వైడ్ దొంగ. చెప్పి దొంగతనం చేయగల సమర్ధుడు. ఇప్పటికీ అతడి సాహసాలు కథలు కథలుగా చెప్పుకుంటారు. ఒక దొంగ జనాల్లో ఎలా హీరో అయ్యాడు అంటే… అతడు మంచి దొంగ. పెద్దలను కొట్టి పేదలకు పెట్టేవాడు. తాను ప్రాణాలకు తెగించి దోచింది దాచుకునేవాడు కాదు.
తన గ్రామంతో పాటు పరిసర గ్రామ పేదలకు పంచేవాడు. ఆయన బయోపిక్ తెరకెక్కించాలని ఎప్పటి నుండో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు అది సాకారం అయ్యింది. రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు టైటిల్ తో మూవీ తెరకెక్కుతుంది. నేడు ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. వాస్తవ సంఘటనలకు కొంత ఫిక్షన్ జోడించి టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కించారు.
టైగర్ నాగేశ్వరరావు పాత్రకు టీజర్లో ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోయింది. క్రూర మృగాలు కూడా ఒక వయసు వరకు పాలే తాగుతాయి. వీడు మాత్రం 8 ఏళ్లకే రక్తం తాగడం మొదలుపెట్టాడని మురళీ శర్మ చెప్పడం గూస్ బంప్స్ కలిగించింది.మరో అధికారి బీహార్లో కరుడుగట్టిన దొంగలను చూశాను. వాళ్ళ కంటే వీడు గొప్పడా అంటే… ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోయింది.
కొత్త దర్శకుడు వంశీ బాగానే రీసెర్చ్ చేశాడు. అతడు అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కించాడని అర్థం అవుతుంది. టైగర్ నాగేశ్వరరావు టీజర్ అంచనాలకు మించి ఉంది. రవితేజకు జంటగా నుపుర్ సనన్ నటిస్తుంది. అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. రేణూ దేశాయ్ కీలక రోల్ చేస్తుంది. దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది.