https://oktelugu.com/

Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వర రావు సెన్సార్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

స్టువర్టుపురం దొంగ గా పేరు పొందిన నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా వాస్తవిక అంశాలతో తెరకెక్కిన సినిమా కావడం వల్ల ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : October 12, 2023 / 03:42 PM IST

    Tiger Nageswara Rao

    Follow us on

    Tiger Nageswara Rao: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ అనగానే అందరికీ మాస్ మహారాజా అనే పేరు గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను మెప్పించడం లో ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉంటాయి. ఈయన సినిమాలు విజయం సాధించకపోయిన కూడా ఆ సినిమా ప్రొడ్యూసర్లకి నష్టమైతే తీసుకురాదు. ఎందుకంటే ఆయన సినిమాలు మినిమం గ్యారంటీ సినిమాలుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందుతూ ఉంటాయి కాబట్టి రవి తేజ కూడా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ల హీరో గా గుర్తింపును సంపాదించుకుంటుంది.

    ఇక ఇలాంటి టైంలో ఇప్పుడు ఈయన స్టువర్టుపురం దొంగ గా పేరు పొందిన నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా వాస్తవిక అంశాలతో తెరకెక్కిన సినిమా కావడం వల్ల ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమా ఎలా ఉండబోతుంది అనే దానికి సంభందించిన క్యూరియాసిటి ని ప్రేక్షకులందరికీ కలిగించింది. ఇక రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది..ఇక ఈ సినిమా సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి యు బై ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టు గా తెలుస్తుంది…

    ఈ సినిమాని చూసిన సెన్సార్ బోర్డ్ మెంబర్స్ కూడా ఈ సినిమా పైన పాజిటివ్ గా స్పందించినట్టు గా తెలుస్తుంది.అయితే ఈ సినిమా లో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ గా ఉండటం వల్లనే ఈ సినిమాకి యు బై ఏ సర్టుఫికేట్ ఇచ్చినట్టు గా వాళ్ళు చెప్తున్నారు…అలాగే కొన్ని షాట్స్ కి కట్స్ కూడా విధించినట్లు గా చెప్పారు.ఇక సెన్సార్ వాళ్ల మాటలను బట్టి చూస్తే ఈ సినిమా లో రవితేజ విశ్వరూపం మనం చూడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ని చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. ఈ సినిమాలో రవితేజ దొంగ గా నటించిన తీరు కూడా చాలా అద్బుతం గా ఉండబోతుంది.అలాగే రవితేజ వింటేజ్ లుక్స్ తో ఈ సినిమా లో అదరగొట్టబోతున్నట్టు గా తెలుస్తుంది…

    అయితే ఈ సినిమా విషయం లో ఒక న్యూస్ కూడా రవి తేజ ఫ్యాన్స్ ని తెగ కలవరపెడుతోంది అదేంటంటే ఈ సినిమా రన్ టైం 3 గంటల 2 నిమిషాలు గా ఉండటం ఇక్కడ చాలా పెద్ద మైనస్ గా మారుతుందో అంటూ చాలా మంది ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అంత సేపు ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలుగుతారా లేదా అనేది తెలియాలి…

    అయితే రంగస్థలం సినిమా నిడివి కూడా 3 గంటలు ఉంటుంది కానీ ఆ సినిమా లో సుకుమార్ తన స్క్రీన్ ప్లే వల్ల బోర్ లేకుండా మ్యాజిక్ చేశాడు. ఈ సినిమాతో వీళ్ళు కూడా ఆ మ్యాజిక్ చేయగలరా, లేదా అనేది తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాలి…ఇక ఈ సినిమా ఆధ్యతం ఉత్కంఠ గా సాగబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమా లో ఒక దొంగతనం చేసే సీన్ ధూమ్ సినిమా లెవల్లో భారీగా ఉండబోతుంది అంటూ తెలుస్తుంది మరి దాన్ని డైరెక్టర్ వంశీ ఎలా హ్యాండిల్ చేశాడనేది మనం స్క్రీన్ పైన చూడాల్సిందే…ఇది కనక కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే ఈ సినిమా ఒక బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు…