Balakrishna- Ravi Teja: బాలకృష్ణ v/s రవితేజా

Balakrishna- Ravi Teja: పండుగలు వస్తున్నాయంటే ఇల్లులే కాదు చిత్ర పరిశ్రమ కూడా అందంగా ముస్తాబవుతుంది. అంటే వాకిట్లో ముగ్గు పెట్టి కలాపి చల్లడం కాదండోయ్ వారి సినిమాలు ఎలా ప్రమోట్ చేయాలి. పండగకు ఏ తేదీనా రిలీజ్ చేయాలి అనే హడావిడిలో పడుతుంటుంది చిత్ర పరిశ్రమ. సంక్రాంతి బరిలో దిగే సినిమాలు మామూలుగా ఉండవు. సంక్రాంతి కోసం ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు దర్శకనిర్మాతలు. కానీ పెద్ద సినిమాల హవా ముందు తట్టుకునే సత్తా లేదేమో […]

Written By: Suresh, Updated On : October 12, 2023 3:53 pm

Balakrishna- Ravi Teja

Follow us on

Balakrishna- Ravi Teja: పండుగలు వస్తున్నాయంటే ఇల్లులే కాదు చిత్ర పరిశ్రమ కూడా అందంగా ముస్తాబవుతుంది. అంటే వాకిట్లో ముగ్గు పెట్టి కలాపి చల్లడం కాదండోయ్ వారి సినిమాలు ఎలా ప్రమోట్ చేయాలి. పండగకు ఏ తేదీనా రిలీజ్ చేయాలి అనే హడావిడిలో పడుతుంటుంది చిత్ర పరిశ్రమ. సంక్రాంతి బరిలో దిగే సినిమాలు మామూలుగా ఉండవు. సంక్రాంతి కోసం ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు దర్శకనిర్మాతలు. కానీ పెద్ద సినిమాల హవా ముందు తట్టుకునే సత్తా లేదేమో అని చిన్న సినిమాలు ఆ వైపు కూడా చూడవు. అందుకే సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతుంటాయి. ఇప్పుడు త్వరలో దసరా పండుగ ఉండడంతో ఈ డేట్స్ ను కూడా లాక్ చేసుకున్నారు బడా హీరోలు.

దసరాకు కూడా చిత్ర సీమలో మంచి గిరాకీ ఉంటుంది. ఈ క్రమంలోని కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించిన విజయ్ లియో సినిమా అక్టోబర్ 19వ తేదీ విడుదల కానుంది. అదేరోజే నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇక అక్టోబర్ 20వ తేదీ మాస్ మహరాజ రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇలా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు వరుసగా ఉండడంతో ఏ సినిమా సక్సెస్ సాధిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలకృష్ణ రవితేజ సినిమాల మధ్య పోటీ మాత్రం తప్పకుండా ఉంటుంది. బాలయ్యకు మాస్, క్లాస్ ఆడియన్స్ ఏ రేంజ్ లో ఉన్నారో చెప్పాల్సిన అవసరం లేదు. అటు రవితేజ కూడా అదే రేంజ్ లో అభిమానులు ఉన్నారు. ఇలా ఈ ఇద్దరు హీరోలు పండుగలకు బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం మొదటి సారి కాదు. ఇదివరకే ఇలాంటి పోటీ చాలా సార్లు నెలకొంది. ఇప్పటికే మూడు సార్లు ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగారు. కానీ మూడు సార్లు రవితేజ విజయం సాధించారు. ఇక ఇది నాలుగో సారి. మరి ఈ సారి ఎవరు విజయం సాధిస్తారు అనే టెన్షన్ ఇప్పటికే మొదలైందట అభిమానుల్లో…

ఇక 2008 సంక్రాంతికి బాలకృష్ణ ఒక్కమగాడు, రవితేజ కృష్ణ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో రవితేజ కృష్ణ సినిమా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత 2009లో రవితేజ కిక్‌, బాలకృష్ణ మిత్రుడు సినిమాలు వారం గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక కిక్ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ముచ్చటగా మూడోసారి 2011లో రవితేజ మిరపకాయ్‌, బాలకృష్ణ పరమవీరచక్ర సినిమాలు ముందుకు రాగా రవితేజనే సక్సెస్ కొట్టారు. ఇప్పుడు నాలుగలో సారి టైగర్ నాగేశ్వర రావుతో రవితేజ, భగవంత్ కేసరితో బాలయ్య ఇద్దరు పోటీలో ఉన్నారు.