Tiger Nageswara Rao Collections : ఈ మధ్య కాలంలో రవితేజ చిత్రాల్లో భారీ హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో టైగర్ నాగేశ్వరరావు ఒకటి. ఈ చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి . రవితేజ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం. అలాగే ఇది ఓ బయోపిక్. 70-80లలో స్టూవర్టుపురం అనే కుగ్రామంలో పుట్టిన ఓ పేదవాడు దేశాన్ని వణికించే దొంగగా ఎదిగాడు. ఆకలి తీర్చుకోవడానికి మొదలైన దొంగతనం… పేదవాళ్లకు పంచే వరకూ వెళ్ళింది. టైగర్ నాగేశ్వరరావు ఇండియన్ రాబిన్ హుడ్ అనే పేరుంది.
టైగర్ నాగేశ్వరరావు జీవితకథ తెరకెక్కించాలని చాన్నాళ్లుగా ప్రయత్నం జరుగుతుంది. అది రవితేజతో సాకారం అయ్యింది. టైగర్ నాగేశ్వరరావు చిత్ర టీజర్స్, ట్రైలర్స్ కూడా ఆకట్టుకున్న తరుణంలో ప్రేక్షకుల్లో చిత్రంపై ఆసక్తి నెలకొంది. అయితే అంచనాలు నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయింది. మొదటి సగం పర్లేదు అన్నారు. సెకండ్ హాఫ్ అయితే నిడివి పెరిగి బోర్ కలిగించిందన్న అభిప్రాయం వినిపించింది.
నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. దసరా పండగ ఈ చిత్రానికి కలిసొచ్చింది. పండగ రోజులు కావడంతో టాక్ తో సంబంధం లేకుండా జనాలు సినిమా చూశారు. ఐదు రోజుల వరకూ టైగర్ నాగేశ్వరరావు వసూళ్లు బాగున్నాయి. ఓవర్సీస్ లో మాత్రం మొదటి నుండి జోరు చూపించలేకపోయింది. ఇక టైగర్ నాగేశ్వరరావు 9వ రోజు వసూళ్ళు గమనిస్తే… తెలుగు రాష్ట్రాల్లో రూ. 67 లక్షల షేర్, 1.2 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం.
ఇక టైగర్ నాగేశ్వరరావు 9 రోజుల వసూళ్ళు గమనిస్తే… ఏపీ/తెలంగాణాలలో రూ.18.74 కోట్ల షేర్ రూ. 32.20 కోట్ల గ్రాస్ రాబట్టింది. కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 1.98 కోట్లు, ఓవర్సీస్ రూ. 1.82 కోట్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ టైగర్ నాగేశ్వరరావు రూ. 22.54 కోట్ల షేర్ రూ.41.65 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.37.50 కోట్లు. రూ. 38.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది.
అంటే మరో రూ.15.9 కోట్ల వసూళ్లు సాధిస్తే హిట్ టాక్ తెచ్చుకుంటుంది. ప్రస్తుత ట్రెండ్ రీత్యా అది అసాధ్యం. టైగర్ నాగేశ్వరరావు అన్ని ఏరియాల్లో నష్టాలు మిగల్చనుంది. దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రవితేజకు జంటగా నుపుర్ సనన్ నటించింది. రేణూ దేశాయ్, నాజర్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలక రోల్స్ చేశారు. జీవి ప్రకాష్ సంగీతం అందించారు.