https://oktelugu.com/

Bigg Boss 7 Telugu : గౌతమ్ కి ఆమెతో స్ట్రాంగ్ బాండింగ్… రతిక నీటిలో తోసేస్తా అంటున్న యావర్!

ఇక ఈ రోజు సండే ఫండే కావడంతో సరదాగా ఒక గేమ్ ఆడదాం అంటూ మొదలుపెట్టారు.

Written By: , Updated On : October 29, 2023 / 04:26 PM IST
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 ఏడు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది.చూస్తుండగానే ఎనిమిదో వారం వీకెండ్ కూడా వచ్చేసింది. కాగా నిన్న శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ కి చివాట్లు పెట్టి బాగా బుద్ధి చెప్పాడు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ రోజు సండే ఫండే కావడంతో సరదాగా ఒక గేమ్ ఆడదాం అంటూ మొదలుపెట్టారు. ముందుగా గౌతమ్ తో ‘నేను ఇద్దరి పేర్లు చెప్తాను.. ఆ ఇద్దరినీ బోట్ లో పెట్టాలి’ అని అర్జున్,ప్రియాంక పేర్లు చెప్పాడు నాగార్జున.

ఆ ఇద్దరు బోట్ లో ఉంటే నీ బోట్ మునిగిపోయే పరిస్థితి. ఇప్పుడు ఒకరిని బోట్ లో నుంచి తోసెయ్యాలి అంటే ఎవరిని తోసేస్తావు అని గౌతమ్ ని నాగార్జున అడిగారు.దానికి గౌతమ్, ప్రియాంకతో నాకు ఎక్కువ బాండింగ్ ఉంది. అందుకే అర్జున్ ని తీసేస్తున్న అని సమాధానం చెప్పాడు. తర్వాత అర్జున్,గౌతమ్ ఇంకా అమర్ ఇద్దరిలో అమర్ ని బోట్ నుంచి తోసేస్తాను అని చెప్పాడు. ఎదుటివారి నుంచి హెల్ప్ తీసుకోకుండా వాడి గేమ్ వాడు ఆడాలని కోరుకుంటున్నాను అని అర్జున్ చెప్పాడు.

ఇక ప్రియాంక ,శోభా లో ఎవరిని తోసేస్తావు అని నాగార్జున అమర్ అని అడిగాడు. దానికి అమర్’ నేను మునిగిపోయేలా ఉన్నాను సార్’ అంటూ జోక్ చేశాడు.తర్వాత యావర్ రతిక ని బోట్ లో నుంచి తోసేస్తానని చెప్పాడు.ఇక తేజ శోభా పేరు చెప్పడంతో ‘నీకుంది లే తర్వాత ‘అని నాగార్జున అన్నారు. తర్వాత భోలే ,ప్రశాంత్ తో నాకు మంచి బాండింగ్ ఉందంటూ అశ్విని ని తీసేసాడు.

ఫైనల్ గా శివాజీ కి యావర్ ఇంకా ప్రశాంత్ లో యావర్ ని బోట్ లో నుంచి తీసేశాడు.’నేను ఈ హౌస్ లో ఉన్నా లేకపోయినా వీడు మాత్రం ఫైనల్ లో ఉండాలి అని కోరుకుంటున్నాను అని చెప్పాడు. గేమ్ ఇలా సరదాగా సాగింది. ఇది ఇలా ఉండగా ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది సస్పెన్స్ గా మారింది. డేంజర్ జోన్ లో ఉన్న శోభా శెట్టి ఇంకా సందీప్ మాస్టర్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠగా మారింది.

Bigg Boss Telugu 7 Promo 1 - Day 56 | Nagarjuna Makes Contestants Laugh During Nominations | StarMaa